NEET UG 2024 : ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘాలో నీట్ యూజీ 2024 పరీక్షలు..!

NEET UG 2024 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ద్వారా ఏజెన్సీ మాస్ కాపీయింగ్ పాల్పడే అభ్యర్థులను గుర్తించనుంది. నీట్ పరీక్ష తర్వాత కూడా అనుమానాస్పద అభ్యర్థులను ఏఐ-ఆధారిత టూల్స్ ద్వారా గుర్తిస్తారు.

NEET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG 2024) మాల్ కాపీయింగ్‌పై కఠిన చర్యలు చేపట్టింది. నీట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పద్ధతులను అరికట్టడానికి, జీరో చీటింగ్‌ను నమోదు చేసేందుకు ఏఐ టెక్నాలజీ ఆధారిత సర్వీసులను వినియోగించనుంది. నీట్ పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత సీసీటీవీ రికార్డింగ్‌లను ఏజెన్సీ ఇన్‌స్టాల్ చేస్తోంది.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఏఐ నిఘాలో నీట్ పరీక్షలపై పర్యవేక్షణ :
సాక్ష్యాధారాలతో అక్రమాలను నిర్ధారించేందుకు ఈ సీసీటీవీలను వినియోగించనుంది. ఎన్టీఏ అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు మాస్ కాపీయింగ్ పాల్పకుండా నివారించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని ఎన్టీఏ వినియోగించనుంది. ఏఐ ఆధారిత రియల్ టైమ్ విశ్లేషణాత్మక టూల్స్, టెక్నాలజీలను కూడా ఉపయోగించనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ద్వారా ఏజెన్సీ మాస్ కాపీయింగ్ పాల్పడే అభ్యర్థులను గుర్తించనుంది. నీట్ పరీక్ష తర్వాత కూడా అనుమానాస్పద అభ్యర్థులను ఏఐ-ఆధారిత టూల్స్ ద్వారా గుర్తిస్తారు. పరీక్షా ప్రక్రియకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్ సిస్టమ్‌ల ద్వారా పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

మే 5నుంచే నీట్ యూజీ పరీక్షలు :
అభ్యర్థులు ఏదైనా ఎలక్ట్రిక్ టూల్స్ ద్వారా అక్రమంగా పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడరాదని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా కాపీయింగ్ వంటి అక్రమ మార్గాల్లో పరీక్ష రాసినట్టు గుర్తిస్తే.. ఎన్టీఏ నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరు కాకుండా డిబార్‌ సహా కఠినమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించింది. మే 5, 2024న నీట్-యూజీ 2024ని ఎన్టీఏ నిర్వహించనుంది.

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష 24 లక్షల మందికి పైగా వివిధ కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, భారత్ వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ యూజీ ఫలితాలు జూన్ 14, 2024న ప్రకటించనున్నారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు