Wuling Mini EV: నానో ఇన్‌స్పిరేషన్‌తో బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ధర తక్కువే!

చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ వుల్లింగ్ హాంగ్ గువాంగ్ తన మినీ ఈవీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి అద్భుతమైన స్పందన వస్తున్నట్లుగా ప్రకటించింది.

Wuling Mini EV: చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ వుల్లింగ్ హాంగ్ గువాంగ్(Wuling Hongguang) ఇటీవల తన మినీ EV ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి అద్భుతమైన స్పందన వస్తున్నట్లుగా ప్రకటించింది. కంపెనీ మినీ ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో కొత్త ప్లేయర్‌ని పరిచయం చేస్తూ.. నానో EV పేరిట వుల్లింగ్ ఈ మినీ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా కూడా కొన్ని సంవత్సరాల క్రితం తన అతి చిన్న, చౌకైన కారు నానోను భారతీయ రోడ్లపై విడుదల చేసింది.

అయితే, వులింగ్ నానో EV చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 305 కి.మీ.ల దూరం వెళ్లగలదు. కారు గరిష్ట వేగం 100 కి.మీ. టియాంజిన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో వూలింగ్ తన కొత్త మినీ ఎలక్ట్రిక్ కారును నానో EVగా పరిచయం చేసింది. డిస్నీతో కలిసి ఈ ఎలక్ట్రిక్ కారు పరిమిత ఎడిషన్‌ని కూడా కంపెనీ ప్రారంభించింది. వూలింగ్ నానో EV డిజైన్‌ను “ఫ్రీ టు గో” అని లేబుల్ చేసింది.

యువతరాన్ని, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కారును తయారుచేసినట్లుగా కంపెనీ చెబుతోంది. మనదేశానికి చెందిన నానో కారు ఇన్స్పిరేషన్‌తో వుల్లింగ్‌ సంస్థ ‘వుల్లింగ్ నానో’ పేరుతో ‘ఈవీ’ కారును తయారు చేసింది. అర్బన్‌ ప్రాంతాల్లో వినియోగించే విధంగా 2సీట్ల సామర్ధ్యంతో డిజైన్‌ చేసిన ఈ కారు ధర రూ.2లక్షల 30వేల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

చైనా నానో EV కారు 2,497 ఎంఎం లెంగ్త్‌, 1526 ఎంఎం విడ్త్‌, 1616 ఎంఎం ఎత్తు, వీల్‌ బేస్‌ 1600 ఎంఎంగా ఉంది. నానో ఈవీ 28kWh సామర్థ్యంతో IP67- సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ ప్రకారం, 305km(190 mi) వరకు పరిధిని అందించగలదు. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ఐచ్ఛిక 6.6-kW పవర్ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు