prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

మ‌హమ్మద్ ప్ర‌వక్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్‌పై పార్టీప‌రంగా బీజేపీ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ దేశంలోని ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఆగ‌ట్లేదు.

prophet row: మ‌హమ్మద్ ప్ర‌వక్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్‌పై పార్టీప‌రంగా బీజేపీ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ దేశంలోని ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఆగ‌ట్లేదు. ఝార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో జ‌రిగిన‌ ఆందోళ‌న‌ల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న చోటుచేసుకుని ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అలాగే, మ‌రికొంద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిలో పోలీసులు కూడా ఉన్నారు.

prophet row: ముస్లిం దేశాల‌న్నీ భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు

సుఖ్‌దేవ్ న‌గ‌ర్‌, లోయ‌ర్ బ‌జార్, డైలీ మార్కెట్ స‌హా రాంచీలోని 10 పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో 144 సెక్ష‌న్ విధించారు. రాంచీ జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ స‌ర్వీసులు తాత్కాలికంగా నిలిపేశారు. నిన్న రాంచీలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో దాదాపు 25 మందికి గాయాల‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ 13 మందికి ప్ర‌స్తుతం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స అందుతోంద‌ని చెప్పారు.

Rajya Sabha Polls: ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు.. న‌వాబ్ మాలిక్‌కు నిరాశ

వారిలోనే ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు. రాంచీ ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ ఝాకి గాయాలు కావ‌డంతో ఆయ‌న‌నూ ఆసుప‌త్రిలో చేర్పించారు. ఆయ‌న‌పై ఆందోళ‌న‌కారులు రాళ్లు విసిరార‌ని అధికారులు చెప్పారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. మ‌రోవైపు, శ‌నివారం రాంచీ బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు