Zara Hatke Zara BachKe : ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న రొమాంటిక్‌ కామెడీ మూవీ.. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 11 నెలల త‌రువాత‌

ఇటీవ‌ల కాలంలో ఓ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది.

Zara Hatke Zara BachKe OTT release date fix

Zara Hatke Zara BachKe OTT release date : ఇటీవ‌ల కాలంలో ఓ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిన‌ప్ప‌టికీ మ‌హా అయితే నెల, రెండు నెల‌ల్లోనే ఓటీటీలోకి వ‌స్తుండ‌డాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే.. బాలీవుడ్ న‌టులు విక్కీ కౌశ‌ల్‌, సారా అలీఖాన్‌లు కీల‌క పాత్ర‌లో న‌టించిన సినిమా ‘జ‌ర హ‌ట్కే జ‌ర బ‌చ్చే’ మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

లక్ష్మణ్‌ ఉటేకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ గ‌తేడాది జూన్‌లో 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. రూ.40 కోట్ల‌తో నిర్మించ‌గా ఏకంగా రూ.115 కోట్లు రాబ‌ట్టింది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను జియో సినిమా ద‌క్కించుకుంది.

Pavithra Jayaram : కారు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి.. విషాదంలో బుల్లితెర పరిశ్రమ

విడుద‌లై 11 నెల‌లు అవుతున్న ఇప్ప‌టి వ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఈ చిత్రాన్ని మే 17 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు జియో సినిమా వెల్ల‌డించింది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులో ఉండ‌నుంద‌ని చెప్పింది.

ఈ సినిమా స్టోరీని క్లుప్తంగా చెప్పాలంటే.. కొత్త‌గా పెళ్ళైన దంపతులు వైవాహిక జీవితం కోసం కుటుంబం నుంచి విడిపోయేందుకు చేసే ప్రయత్నాలే ఈ సినిమా క‌థ‌.