Pavithra Jayaram : కారు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి.. విషాదంలో బుల్లితెర పరిశ్రమ
నేడు ఉదయం ఓ సీనియర్ సీరియల్ నటి కారు ప్రమాదంలో మరణించడం అందర్నీ షాక్ కి గురిచేసింది.

Trinayani Serial Actress Pavithra Jayaram Passed away in Car Accident
Pavithra Jayaram : తాజాగా నేడు ఉదయం ఓ సీనియర్ సీరియల్ నటి కారు ప్రమాదంలో మరణించడం అందర్నీ షాక్ కి గురిచేసింది. కన్నడ పరిశ్రమకు చెందిన పవిత్ర జయరామ్ నేడు తెల్లవారు జామున మహబూబ్ నగర్ భూత్ పల్లి వద్ద కారు ప్రమాదంలో మరణించింది. పవిత్ర ప్రయాణిస్తున్న కారు, ఓ బస్సు ఢీకొనడంతో పవిత్ర జయరామ్ అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ఆ కారులో పవిత్ర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ లో పవిత్రతో పాటు ఉన్న నటుడు చంద్రకాంత్ తో పాటు మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ఈ యాక్సిడెంట్ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.
పవిత్ర జయరామ్ కన్నడలో రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై అనంతరం కన్నడలో అనేక సీరియల్స్ చేసి మెప్పించింది. తెలుగులో ప్రస్తుతం త్రినయని సీరియల్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. త్రినయని సీరియల్ లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పవిత్ర. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ తెచ్చుకుంది.
Also Read : Sridevi : ముంబైలో ఓ చౌరస్తాకు శ్రీదేవి పేరు.. ఆమెపై గౌరవంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్..
పవిత్ర జయరామ్ ఇలా కార్ యాక్సిడెంట్ లో మరణించడంతో ఆమె అభిమానులు, బుల్లితెర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.