Ranver Singh : సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్.. పవన్ సినిమాను టార్గెట్ చేసి..?
పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ని టార్గెట్ చేయడానికి కొంతమంది దురంధర్ సినిమాని వాడుకుంటున్నారు. (Ranver Singh)
Ranver Singh
Ranver Singh : ఈ ఉగాదికి రణవీర్ సింగ్ దురంధర్ 2, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పవర్ స్టార్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ హంగామా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే దురంధర్ పార్ట్ 1 పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో కూడా పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారు. ఊళ్ళల్లో దురంధర్ కి పెద్ద క్రేజ్ లేకపోయినా సిటీలలో, యూత్ లో మాత్రం ధురంధర్ 2 పై అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే దురంధర్ పార్ట్ 2 బుకింగ్స్ ప్రీమియర్స్ కి ఓపెన్ అవ్వగా భారీగానే సేల్స్ అవుతున్నాయి. అయితే పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ని టార్గెట్ చేయడానికి కొంతమంది దురంధర్ సినిమాని వాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రణవీర్ సింగ్ కు, ఆయన సినిమాలకు ఫ్యాన్స్ అనేది ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ ఫ్యాన్స్ అంటూ, ధురంధర్ ఫ్యాన్స్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ పై సోషల్ మీడియాలో నెగిటివిటి చేస్తున్నారు కొంతమంది.
Also Read : Virosh Haldi Ceremony : హల్దీ వేడుకల ఫోటోలను షేర్ చేసిన విజయ్ – రష్మిక.. క్యూట్ కపుల్ ఫోటోలు వైరల్..
పవన్ అంటే పడని రాజకీయ శత్రువులు పవన్ సినిమా వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి నెగిటివిటి ప్రచారం చేస్తారని తెలిసిందే. ఇప్పుడు కూడా ఉస్తాద్ పై నెగిటివ్ ప్రచారం చేస్తూ ఈ సారి దురంధర్ ని అడ్డుపెట్టుకుంటున్నారు. కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా రిలీజ్ కి వేరే ఏ సినిమా లేకపోవడంతో దురంధర్ కి ఎలివేషన్ ఇస్తూ ఉస్తాద్ ని పై నెగిటివ్ చేస్తున్నారు. దురంధర్ మంచి సినిమానే కానీ అసలు బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సినిమాలని ఎంత చిన్న చూపు చూస్తారో అందరికి తెలుసు.
Ranver Singh
సలార్, రాజాసాబ్ సమయంలో షారుఖ్ ఫ్యాన్స్, బాలీవుడ్ ఎంత నెగిటివిటి చేసిందో చూసాము. అయినా సరే మన తెలుగు సినిమా ఉన్నప్పుడు దానిపై నెగిటివిటి చేస్తూ దురంధర్ ని హైప్ చేస్తున్నారు కొంతమంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమాపై నెగిటివిటి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ధురంధర్ ప్రీమియర్స్ కి భారీగా థియేటర్స్ ఇచ్చి భారీ బుకింగ్స్ అవుతున్నా కొంతమంది దురంధర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వట్లేదు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
Also Read : Sai Pallavi : చేసిన కథనే మళ్ళీ మళ్ళీ చేస్తున్న సాయి పల్లవి.. ఒకే స్టోరీతో మూడు సినిమాలు..
పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన దగ్గర్నుంచి ఆయన సినిమాలపై రిలీజ్ కి ముందు నుంచే సినిమా ఎలా ఉన్నా నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ కి మళ్ళీ మొదలయింది. అయితే పవన్ సినిమా ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ వస్తాయి, ఆయన ఫ్యాన్స్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత నెగిటివిటి చేస్తారో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. OG ప్రీమియర్స్ 35 కోట్లు వసూలు చేసింది. అది కేవలం తెలుగు సినిమానే. దాంతో భారీ హైప్ ఉన్న సినిమా, పాన్ ఇండియా సినిమా దురంధర్ ప్రీమియర్స్ కంపేర్ చేస్తున్నారంటేనే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అందరికి తెలుస్తుంది అని పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ ని హైప్ చేస్తున్నారు. ఇక గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు.
