Sai Pallavi : చేసిన కథనే మళ్ళీ మళ్ళీ చేస్తున్న సాయి పల్లవి.. ఒకే స్టోరీతో మూడు సినిమాలు..
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతుంది సాయి పల్లవి. (Sai Pallavi)
Sai Pallavi
Sai Pallavi : తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది సాయి పల్లవి. వేరే హీరోయిన్స్ లాగా మేకప్ లు వేసుకోకుండా, బోల్డ్ డ్రెసులతో కనిపించకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫాలోయింగ్ తెచ్చుకుంది. సాయి పల్లవి సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ కాకుండా కాస్త డిఫరెంట్ గానే చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతుంది సాయి పల్లవి.
సాయి పల్లవి బాలీవుడ్ లో ఏక్ దిన్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ ట్రైలర్ చుసిన తర్వాత సాయి పల్లవిపై ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. ఒకే కథతోటి ఎన్ని సినిమాలు చేస్తుంది సాయి పల్లవి అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read : Rasha Thadani : ఫ్యామిలీతో రషా తడాని బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన మహేష్ అన్న కొడుకు..
ఏక్ దిన్ ట్రైలర్ చూసిన తర్వాత, బాలీవుడ్ సమాచారం ప్రకారం సాయి పల్లవి తన ప్రేమని మర్చిపోతుందని, హీరోని మర్చిపోతుందని, మళ్ళీ హీరో ఎలా దగ్గరయ్యాడు అనే కథాంశంతో ఉంటుందని తెలుస్తుంది. గతంలో సాయి పల్లవి ఇదే కథతో ప్రేమమ్, పడి పడి లేచే మనసు సినిమాలు చేసింది.
ప్రేమమ్ లో కూడా సాయి పల్లవి పాత్ర యాక్సిడెంట్ అయి హీరోని మర్చిపోతుంది. పడి పడి లేచే మనసు సినిమాలో కూడా తన వ్యాధి వల్ల మర్చిపోతుందని చూపిస్తారు. అటు ఇటుగా ఈ మూడు సినిమాల కథ హీరోయిన్ తన ప్రేమని, హీరోని మర్చిపోవడమే. దీంతో ఒకే కథతో సాయి పల్లవి మూడు భాషల్లో మూడు సినిమాలు చేసింది అంటున్నారు. మరి ఏక్ దిన్ అసలు కథ తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్ వచ్చేసింది.. 20 ఏళ్ళు పెద్దవాడితో ప్రేమ..
