School Holidays : మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు..
School Holidays : ఏపీని మురసు తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీకర గాలులతోపాటు వర్షాలు దంచికొడుతున్నాయి.
Cyclone Murasu Effect School Holidays
School Holidays : ఏపీని మురసు తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీకర గాలులతోపాటు వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, మంగళవారం ఉదయం తుపాను తీరందాటింది. తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరందాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.. మరికొన్ని ప్రాంతాల్లో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.
Also Read : Murasu Cyclone : తీరం దాటిన మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
తుపాను తీరందాటడంతో ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. బాపట్ల, నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు హాలిడే డిక్లేర్ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
