Case Registered Against YS Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణాలివే..
Case Registered Against YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
YS Jagan
Case Registered Against YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, ఏజెంట్లతో కలిసి జగన్ ధర్నా నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలో తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ జగన్ నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారని ఆయన పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. జగన్ మోహన్ రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి, మరికొందరు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్లతో కలిసి బైఠాయించిన విషయం తెలిసిందే. వైసీపీ ఏజెంట్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారంటూ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ అంటే పోటీ జరగాలి.. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనబడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు అంటూ అధికారులను వైఎస్ జగన్ నిలదీశారు. బీహార్ పరిస్థితులను ఏపీలో చూస్తున్నామని.. మాజీ సీఎం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితులు ఏమిటి అంటూ జగన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో వైసీపీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా రిగ్గింగ్ చేసుకుంటున్నారంటూ అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు అక్కడికి చేరుకోవటంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
