Sridevi : ముంబైలో ఓ చౌరస్తాకు శ్రీదేవి పేరు.. ఆమెపై గౌరవంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్..
తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శ్రీదేవి గౌరవార్థం, ఆమెని గుర్తుచేసుకుంటూ ముంబైలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టారు.

Mumbai Municipal Corporation Named Sridevi to a Junction in Mumbai
Sridevi : శ్రీదేవి.. అతిలోక సుందరిగా ఎన్నో సినిమాల్లో మెప్పించి సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని భాషలో ప్రేక్షకులని తన నటన, అందంతో మెప్పించి దేశమంతా అభిమానులని సంపాదించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని ముంబైలో సెటిలైపోయింది. అనుకోకుండా 2018 లో శ్రీదేవి అకాల మరణం చెందింది.
ఇప్పటికి ఆమె అభిమానులు, ప్రేక్షకులు శ్రీదేవిని ఆమె సినిమాలతో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శ్రీదేవి గౌరవార్థం, ఆమెని గుర్తుచేసుకుంటూ ముంబైలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టారు. ముంబైలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ ని శ్రీదేవి కపూర్ చౌక్ గా పేరు మార్చారు. శ్రీదేవి గతంలో ఆ రోడ్ లోనే నివసించేది. ఆమె అంతిమయాత్ర కూడా ఆ రోడ్ నుంచే జరిగిందని ఆమె జ్ఞాపకార్థంగా ఆ జంక్షన్ కి శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని అభినందిస్తున్నారు.
Also Read : Akkineni Cousins : ఎన్నికల వేళ అక్కినేని కజిన్స్ అంతా ఒకేచోట.. వైరల్ అవుతున్న ఫొటో..
ఇక ప్రస్తుతం శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.