Oscar Story: ఆస్కార్ వెనుక అసలు కథ.. ఆ బంగారు విగ్రహానికి పేరు పెట్టింది ఎవరు? ఆసక్తికరమైన నిజాలు!
అకాడమీ అవార్డ్స్, ఆస్కార్(Oscar Story) అవార్డ్స్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.
The Real Story Behind the Name 'Oscar'
Oscar Story: సినిమా ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారం అంటే ఆస్కార్ అనే చెప్తారు. ప్రతీ సినిమా టెక్నీషియన్ కి ఆస్కార్ గెలవాలనే ఆశ ఉండటం సహజం. కానీ, ఆ అర్హత పొందడం అంత సులభం కాదు. రీసెంట్ గా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్(Oscar Story) సాధించిన విషయం తెలిసిందే. ఈ వేడుక ప్రతీ ఏడాది ఘనంగా జరుగుతుంది. ఆ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డుతో సత్కరిస్తూ ఉంటారు.
అయితే, ప్రతీసారి ఆస్కార్ అవార్డ్స్ సమయంలో అకాడమీ అవార్డ్స్ అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఈ రెండూ వేర్వేరు అవార్డులేమో అనే సందేహం ఉంటుంది. కానీ, నిజానికి ఈ రెండు పేర్లు ఒకటే. అఫీషియల్‌గా ఈ వేడుకను ‘అకాడమీ అవార్డ్స్’ అని పిలిస్తే, వాడుకలో మాత్రం ‘ఆస్కార్’ అనే ముద్దుపేరు బాగా పాపులర్ అయిపోయింది. కాలక్రమేణా సామాన్య జనం నుంచి మీడియా వరకు అందరూ ఆస్కార్‌నే వాడటానికి ఇష్టపడుతున్నారు.
Swayambhu: నిఖిల్ ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అంతా ఓటీటీ చేతిలోనే.. ఎప్పుడంటే అప్పుడే!
విజేతలకు ఇచ్చే ఆ ప్రసిద్ధ బంగారు విగ్రహానికి కూడా ఒక అధికారిక పేరు ఉంది. అకాడమీ దీనిని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అని పిలుస్తుంది. కానీ బయట మాత్రం ఎవరూ ఈ పేరును పెద్దగా వాడరు, అందరూ ‘ఆస్కార్’ అనే పిలుస్తారు. అసలు ఆస్కార్ కు ఆ ముద్దుపేరు ఎలా వచ్చిందనే దానిపై కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. 1930వ దశకంలో అకాడమీ లైబ్రేరియన్‌గా పనిచేసిన మార్గరెట్ హెరిక్ ఆ విగ్రహాన్ని చూసి, అది అచ్చం తన ‘అంకుల్ ఆస్కార్’ లాగే ఉందని సరదాగా అన్నారట. ఆ తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది.
మరో కథనం ప్రకారం, సిడ్నీ స్కోల్‌స్కీ అనే కాలమిస్ట్ తన రాతల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడి ప్రాచుర్యంలోకి తెచ్చారు. మొదట్లో ఈ పేరును అకాడమీ అంగీకరించలేదు. కానీ, చివరికు 1939లో ‘ఆస్కార్’ అనేది తమ అధికారిక ముద్దుపేరుగా గుర్తించింది. అప్పటి నుండి ఆస్కార్ విన్నర్, ఆస్కార్ నామినేషన్ వంటి పదాలు ప్రపంచమంతా ప్రచారంలోకి వచ్చాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఆస్కార్ అన్నా అకాడమీ అవార్డ్ అన్నా ఒక్కటే. సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ గౌరవం ఇది. పేర్లు వేరైనా, దాని వెనుక ఉన్న విలువ మాత్రం ఒక్కటే.
