Akkineni Cousins : ఎన్నికల వేళ అక్కినేని కజిన్స్ అంతా ఒకేచోట.. వైరల్ అవుతున్న ఫొటో..
అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.

Akkineni Family Cousins Get together Photo goes Viral
Akkineni Cousins : దేశమంతా ఎన్నికల వేవ్ కనిపిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపే ఎన్నికలు కావడంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు పయనమయ్యారు. నేడు ఆదివారం సెలవు దినం కూడా కావడంతో ముందుగానే అందరూ ఇళ్లకు వెళ్లి ఫ్యామిలీలతో సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.
హీరో సుశాంత్.. అక్కినేని, వారి కుటుంబంలోని కజిన్స్ అంతా ఒకేచోట చేరిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫొటోలో నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ.. మరికొంతమంది కజిన్స్ ఉన్నారు. ఇలా అందరూ ఒకే చోట చేరిన ఫొటోని షేర్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారయింది. ఇక అక్కినేని అభిమానులు ఈ ఫొటోని తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫొటోలో ఉన్న అక్కినేని కజిన్స్ అంతా సినిమాలతో, బిజినెస్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నా ఇలా ఫ్యామిలీ కోసం కొంచెం సమయం కేటాయించి ఆదివారం పూట అందరూ కలవడం అభినందించదగ్గ విషయం.