Rashi Khanna: రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్.. ‘తెలుసు కదా’ ప్లాప్ అవుతుందని ముందే తెలుసు
తెలుసు కదా సినిమా రిజల్ట్ పై రాశి ఖన్నా(Rashi Khanna) షాకింగ్ కామెంట్స్.
Raashi Khanna shocking comments on Telusu Kada movie result
Rashi Khanna: సినిమా ఇండస్ట్రీలో ఒక చిత్రం విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉన్నా, నటీనటులు సాధారణంగా తమ సినిమాను వెనకేసుకొస్తుంటారు. కానీ, టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా మాత్రం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Monalisa: కుంభమేళా మోనాలిసా పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. ఇది లవ్ జిహాద్ అంటూ తండ్రి సంచలన కామెంట్స్
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశి ఖన్నా(Rashi Khanna) తన గత చిత్రం తెలుసు కదా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించారు. ఈ సినిమా ఫలితం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ.. “తెలుసు కదా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో నాకు అర్థమైపోయింది.
కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని నాకు అనిపించింది. ఇదే విషయాన్ని నేను చిత్ర యూనిట్ చాలాసార్లు చెప్పాను. కానీ, నీరజ కోన విజన్ మీద నమ్మకంతో అలాగే ముందుకు వెళ్ళాము. ఒక నటిగా నేను నా బాధ్యతను పూర్తి చేయాలి కాబట్టి, డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లిపోయాను” అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. దీంతో, రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
