Vruschika Rasi Phalalu 2026 : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి దశ తిరగబోతుంది.. పట్టిందల్లా బంగారమే.. 2,3 రకాలుగా ఆదాయం..!
Vruschika Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి తిరుగుండదని.. 2, 3 రకాల ఆదాయం చేతికి అందుతందంటున్నారు.
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 vruschika rasi phalalu Scorpio horoscope
Vruschika Rasi Phalalu 2026 : ఈ ఉగాది పండగ నుంచి వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని అంటున్నారు పండితులు. ఈ సంవత్సరం వీరికి విరివిగా ఆదాయం లభిస్తుందని.. ఆదాయ మార్గాలు పెరిగి అనేక మార్గాల్లో ధనం చేతికి అందుతుందని తెలిపారు. భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారని.. ఆస్తులను రెట్టింపు చేసుకుంటారని తెలిపారు. మొండి బాకీలు వసూలవుతాయని.. దీర్ఘకాలంగా విసిగిస్తోన్న కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుందని తెలిపారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయన్నారు.
ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారులు, కళాకారులు, క్రీడాకారులు, అన్నదాతలు, రాజకీయనాయకులు, స్త్రీలు ఇలా అన్ని రంగాల వారికి కలిసి వస్తుందని.. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని.. అన్నదాతలు అప్పులు తీర్చుతారని తెలిపారు.
ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 6
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- విశాఖ (4వ పాదం) మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి (2027), ఫిబ్రవరి (2027) ఆది, సోమ, మంగళ 3, 4, 6, 7
- అనురాధ (1-4 పాదాలు) మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి (2027) ఆది, సోమ, మంగళ 1, 2, 4, 8
- జ్యేష్ట (1-4 పాదాలు) జూన్, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి (2027), మార్చి (2027) ఆది, బుధ, శుక్ర 2, 3, 4, 5
పరిహారాలు-పూజలు:
- ఈ రాశి వారు రాహు, కేతు గ్రహాలకు పూజలు చేసి.. మినుములు, ఉలవలు దానం ఇవ్వాలి.
- దైవ దర్శనం: గ్రామ దేవతలను, దుర్గాదేవిని లేదా వారాహి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల రాజయోగం కలుగుతుంది.
- స్తోత్ర పఠనం: నవదుర్గా స్తోత్రం లేదా దుర్గా అష్టోత్తరం పటించడం వల్ల విశేష శుభ ఫలితాలు లభిస్తాయి.
- అభిషేకం: శనివారాలు శని దేవునికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
