Mercedes-Benz Cars : లగ్జరీ కార్ల మార్కెట్లో బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న ఆడి, బెంజ్ కార్ల ధరలు
Mercedes-Benz Cars : భారత మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మెర్సిడెస్-బెంజ్ ఏప్రిల్ 1, 2026 నుంచి మొత్తం వాహన పోర్ట్‌ఫోలియోలో దాదాపు 2 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Mercedes-Benz Cars
- భారీగా పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి
- కరెన్సీ మార్పులు, పెరుగుతున్న ఖర్చులే కారణం
- 2 శాతం ధరలు పెంచనున్న ఆడి ఇండియా
Mercedes-Benz Cars : లగ్జరీ కారు కొనేవారికి బిగ్ షాక్.. మీరు లగ్జరీ కార్ల ప్రియులైతే ఇది మీకోసేమే.. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరల పెంపును ప్రకటించింది.
అతి త్వరలో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ తన పోర్ట్‌ఫోలియోలో ఏప్రిల్ 1, 2026 నుంచి ధరలు సుమారు 2 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. కరెన్సీలో మార్పులు, రూపాయి బలహీనపడటం, పెరుగుతున్న ఖర్చులే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
పెరిగిన మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు :
రూపాయితో పోలిస్తే యూరో బలపడటం వల్ల కంపెనీ ఖర్చులు భారీగా పెరిగాయని మెర్సిడెస్-బెంజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ సిస్సింగ్ తెలిపారు. ముడి పదార్థాలు, ఇతర ఇన్పుట్ ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో కంపెనీ ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
భారత మార్కెట్లో విక్రయించే అన్ని కార్లపై మెర్సిడెస్-బెంజ్ కొత్త ధరలు వర్తిస్తాయి. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. కస్టమర్లకు ప్రీమియం ప్రొడక్టులు, అత్యుత్తమ సర్వీసు ఎక్స్ పీరియన్స్ అందించే దిశగా దృష్టి సారిస్తూనే ఉంటామని మెర్సిడెస్-బెంజ్ పేర్కొంది.
ఆడి కార్ల ధరలు కూడా పెంపు :
మెర్సిడెస్-బెంజ్ తర్వాత జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి కూడా కార్ల ధరలను పెంచనుంది. ఆడి ఇండియా కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.
