BAN vs PAK : చరిత్ర సృష్టించిన పాక్ ఆటగాడు.. విండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్‌గేల్ రికార్డు బ్రేక్..
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (BAN vs PAK ) పాకిస్థాన్ యువ ఆటగాడు మాజ్ సదఖత్ అరుదైన ఘనత సాధించాడు
Maaz Sadaqat Creates History becomes Youngest Players Score 50 Take 3 Wickets In An ODI vs Bangladesh
- బంగ్లాదేశ్‌తో రెండో వన్డే
- క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేసిన సదఖత్
- అతి పిన్న వయస్కుడిగా
BAN vs PAK : ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ ఆటగాడు మాజ్ సదఖత్ అరుదైన ఘనత సాధించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్ పై ఓ వన్డే మ్యాచ్‌లో యాభై పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడిగా సదఖత్ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనతను సదాఖత్ 20 ఏళ్ల 302 రోజుల వయసులో సాధించగా.. గేల్ 23 ఏళ్ల 73 రోజుల వయసులో అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో చిగుంబరా, ఒమర్జాయ్ లు ఉన్నారు.
Jemimah Rodrigues : ట్రెండీ లుక్‌లో జెమీమా రోడ్రిక్స్..
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సదఖత్ 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఐదు ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 128 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
బంగ్లాదేశ్ పై ఓ వన్డే మ్యాచ్‌లో 50 పరుగులు చేసి మూడు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కులు వీరే..
* మాజ్ సదఖత్ (పాకిస్థాన్) – 20 ఏళ్ల 302 రోజులు (75 రన్స్, 3 వికెట్లు)
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 23 ఏళ్ల 73 రోజులు (73 రన్స్, 3 వికెట్లు)
* ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే) – 23 ఏళ్ల 227 రోజులు (60 రన్స్, 3 వికెట్లు)
* అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్) – 24 ఏళ్ల 332 రోజులు (70 రన్స్, 4 వికెట్లు)
* సోలమన్ మైర్ (జింబాబ్వే) – 25 ఏళ్ల 99 రోజులు (52 రన్స్, 3 వికెట్లు)
