Keep Your Lungs : కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు !

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి : రెగ్యులర్ వ్యాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి ,ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వారానికి ఐదు సార్లు 30 నిమిషాల మితమైన శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకుని వ్యాయామాలు చేయటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

Keep Your Lungs : దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ధృవీకరించిన డేటా ప్రకారం ప్రస్తుతం, 4.47 కోట్ల కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కోవిడ్ మహమ్మారి నాల్గవ వేవ్ ప్రస్తుతం కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి , ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…

ఊపిరితిత్తులను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి?

పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపధ్యంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ;

1. ధూమపానం మానేయండి: ధూమపానం చేసేవారైతే, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ధూమపానాన్ని మానేయాలి. ధూమపానం ఊపిరితిత్తులను చికాకు కలిగిస్తుంది. ఊపిరితిత్తుల సహజ రక్షణను బలహీనపరుస్తుంది. కోవిడ్-19తో సహా ఇతర శ్వాసకోశ వ్యాధులు రావటానికి ధూమపానం కారణమౌతుంది.

2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి : రెగ్యులర్ వ్యాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి ,ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వారానికి ఐదు సార్లు 30 నిమిషాల మితమైన శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకుని వ్యాయామాలు చేయటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

READ ALSO : Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, గుర్తించటంలో దోహదపడే ముందస్తు పరీక్షలు!

3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు , చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం నివారించాలి.

4. ప్రాణాయామం వంటి శ్వాసమెరుగుపరిచే పద్దతులు : ప్రాణాయామం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం డయాఫ్రాగమ్‌ను బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను విశ్రాంతికి, నయం చేయడానికి ఉపకరిస్తుంది. కోవిడ్ నేపధ్యంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది.

5. వాయు కాలుష్యాన్ని నివారించండి: వాయు కాలుష్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట వ్యాయామం చేయకుండా ఉండండి. ఇల్లు ,కారు కిటికీలు మూసి ఉండేలా చూసుకోండి. బయట దుమ్ముధూళిలో తిరిగే సమయంలో ఫేస్ మాస్క్ ధరించండి. ఇంటి లోపల గాలిని ఫిల్టర్ చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించండి.

READ ALSO : Green Tea : గ్రీన్ టీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే?

6. తరచుగా ఇంటిని, పరిసరాలను శుభ్రపరచండి ; కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంటిలోని ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. క్రిమిసంహారక చేయండి. గాలి నాణ్యత అనేక శ్వాసకోశ రుగ్మతలను పెంచుతుంది. కరోనావైరస్ ప్రమాదాన్ని తగ్గించటానికి ఇంటిలోని ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమిసంహారక చేయడం మంచిది.

7. టీకాలు వేయించుకోండి: కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున దానిని తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు.

READ ALSO : Vitamin B12 : విటమిన్‌ B12 లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే? లోపాన్ని నివారించాలంటే ?

ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కోవిడ్-19 బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. తగిన జాగ్రత్తలు పాటించటం ద్వారా సురక్షితంగా ఉండండి.

ట్రెండింగ్ వార్తలు