Anti-Hijab Protest row: ఇరాన్‌లో ఆందోళనలపై మౌనం వీడిన సుప్రీం లీడర్ అయతుల్లా.. ‘అంతా అమెరికా వల్లే..’ అంటూ నిందలు

మహ్సా అమిని మృతిపై అయతుల్లా అలీ ఖమెనెయి స్పందిస్తూ.. ‘‘ఇది చాలా బాధాకర ఘటన. మా హృదయం ముక్కలయ్యేలా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటిని సృష్టిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అని ఆరోపించారు.

Anti-Hijab Protest row: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనెయి స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఇవాళ దీనిపై స్పందించారు. తమ దేశంలో జరుగుతోన్న ఆందోళనలకు అమెరికా, ఇజ్రాయెల్ అని కారణమని చెప్పుకొచ్చారు. ఈ హింసాత్మక ఆందోళనలను ఖండిస్తున్నానని అన్నారు. ఇరాన్ లో హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలోనే తీవ్రంగా గాయపడి, మృతి చెందిన విషయం తెలిసిందే.

అనంతరం ఇరాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో కఠిన చట్టాలు, హిజాబ్ నిబంధనలు వద్దని ప్రజలు నినదిస్తున్నారు. మహ్సా అమిని మృతిపై అయతుల్లా అలీ ఖమెనెయి స్పందిస్తూ.. ‘‘ఇది చాలా బాధాకర ఘటన. మా హృదయం ముక్కలయ్యేలా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటిని సృష్టిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అని ఆరోపించారు. అసాధారణ రీతిలో ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు