Shocking Video: బాబోయ్.. మొసలిని కూడా వదలని కొండచిలువ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే ..

కొండచిలువను ల్యాబ్ లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి దానిని కోసి చనిపోయిన మొసలిని బయటకు తీసిన దృశ్యాలతో కూడిన వీడియోను సైంటిస్ట్ రోసీమూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మంగళవారం ఫుటేజీని షేర్ చేయగా గంటల వ్యవధిలోనే 10 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.

Shocking Video: కొండ చిలువలు సాధారణంగా మేకలు, కుందేళ్లు, జింకులు లాంటి జంతువులను మింగుతాయి. కానీ ఫ్లోరిడాలోని బర్మీస్‌ ప్రాంతంలో సుమారు 18 అడుగుల కొండచిలువ ఏకంగా మొసలిని మింగేసింది. మొసలి భారీ ఆకారం కలిగి ఉంటుంది. అయినా ఆ కొండచిలువ సునాయసంగా మొసలిని మింగేసి అటవీ ప్రాంతంలో కదలలేని స్థితిలో ఉంది. దీనిని ఎవర్ గ్లేడ్స్‌లోని నేషనల్ పార్క్ సిబ్బంది గమనించిన ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్‌లో సైంటిస్టులు దానిని పరిశీలించగా అప్పటికే అది చనిపోయి ఉండటాన్ని గమనించారు.

T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..

కొండచిలువ పొట్ట ఉబ్బుగా ఉండటంతో ఏదో జంతువును మింగిఉంటుందని భావించి.. అసలు ఏం జంతువును మింగి ఉంటుందో చూసేందుకు కత్తులతో కొండచిలువ శరీరభాగాన్ని కోశారు. ఆ కొండచిలువ మింగింది భారీకాయం కలిగిన మొసలిని అని గుర్తించి సైంటిస్టులు కంగుతిన్నారు. భారీకాయం కలిగిన మొసలిని మింగడంతో అది జీర్ణంకాక కొండచిలువ ప్రాణాలు విడిచింది.

కొండచిలువను ల్యాబ్ లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి దానిని కోసి చనిపోయిన మొసలిని బయటకు తీసిన దృశ్యాలతో కూడిన వీడియోను సైంటిస్ట్ రోసీమూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మంగళవారం ఫుటేజీని షేర్ చేయగా గంటల వ్యవధిలోనే 10 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలతో రీట్వీట్లు చేస్తున్నారు. బర్మీస్ కొండచిలువలు, వాస్తవానికి పెంపుడు జంతువులుగా యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకురాబడ్డాయి. 1970ల చివరిలో మానవులు వాటిని అడవిలోకి వదిలినప్పటి నుంచి ఎవర్‌గ్లేడ్స్‌ నేషనల్ పార్కులో అవి ప్రమాదకరంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు