Indian General Election : భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం.? ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం చీప్ ట్రిక్స్‌.!

భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేస్తున్న కుట్రలను బయటపెట్టింది రష్యా. భారత్‌ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేసే కుట్రకు అమెరికా తెరలేపిందని రష్యా ఆరోపిస్తుంది.

 Indian General Election : పేరుకు అగ్రరాజ్యమైన ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరించే తీరే వేరు. తమ డామినేషన్‌ కోసం ఏ స్థాయికి అయినా వెళ్తుంది అగ్రరాజ్యం. రష్యా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది రష్యా.

Read Also : Cm Revanth Reddy : ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలి- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై..ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా అండగా నిలిచింది. పన్నూ హత్య వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అమెరికా ..ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని స్పష్టం చేసింది. ఇక, భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేస్తున్న కుట్రలను బయటపెట్టింది రష్యా. భారత్‌ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేసే కుట్రకు అమెరికా తెరలేపిందని రష్యా ఆరోపిస్తుంది.

భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపర్చాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందని తెలిపింది. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది రష్యా. రష్యా ఆరోపణలపై భారత్ కూడా స్పందించింది. ఇది తమ దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఏమాత్రం సరికాదని భారత విదేశాంగ అభిప్రాయపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో..అమెరికా జోక్యం అనేది ఆందోళన కలిగించే అంశమని తెలిపింది భారత్.

లేటెస్ట్‌గా భారత ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోబోతుందన్న.. మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ సంచలనం రేపింది. ఏఐ కంటెంట్‌ను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా కుట్రలు చేస్తుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మీమ్స్‌, వీడియోలు, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని తెలిపింది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో తాము అనుకున్నట్లుగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగేలా డ్రాగన్ కంట్రీ మైండ్ గేమ్ ఆడుతోందని అలర్ట్ ఇచ్చింది.

చైనా ఇంటర్వెన్షన్‌ ఇష్యూ మరువకముందే ఇప్పుడు.. అమెరికా ఇన్వాల్‌మెంట్‌పై వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ రెండు దేశాలు భారత ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావితం చేస్తాయన్న విషయం అటుంచితే.. అసలు ఓ దేశం ఎన్నికల ప్రక్రియలో మరో దేశం ఎందుకు జోక్యం చేసుకోవడం ఏంటన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య ధోరణి అంతర్గత అంశాల్లో జోక్యం వరకు వస్తే..భవిష్యత్‌లో పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

Read Also : Air India Express : సిబ్బంది యాక్షన్.. ఎయిరిండియా రియాక్షన్.. ఏకంగా 30మంది తొలగింపు..!

ట్రెండింగ్ వార్తలు