Iran vs Israel War : ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం ఎటాక్.. ఇది శాంపిల్ మాత్రమే.. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్
Iran vs Israel War : ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్‌పై యూఎస్ బలగాలు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Iran vs Israel War US military struck on Kharg Island
- ఇరాన్ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన ట్రంప్
- ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ ఖర్గ్ ఐలాండ్
- ఖర్గ్ ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలపై దాడి
- ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయాలనూ టార్గెట్ చేస్తాం
- ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Iran vs Israel War : పశ్చిమాసియాలో పరిస్థితులు ఎంతమాత్రమూ కుదటపడట్లేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూనే ఉంది. శనివారంతో యుద్ధం 15వ రోజుకు చేరింది. ఇరాన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన, ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా సైన్యం విరుచుకుపడింది.
Also Read : Iran War: యుద్ధం ముగించేందుకు సిద్ధం..! మూడు కండీషన్లు పెట్టిన ఇరాన్
ఖర్గ్ ఐలాండ్‌పై ఎటాక్..
పర్షియన్ గల్ప్ ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తిమంతమైనవని, తాము లక్ష్యంగా చేసుకునే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్‌కు లేదు.. ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఇరాన్‌కు వార్నింగ్..
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఖర్గ్ ఐలాండ్‌లో యూఎస్ సెంట్రల్ కమాండ్ కేవలం సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది. ఆ దీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదు. ఇరాన్ ఇప్పటికైనా వెనక్కు తగ్గాలి. ఇరాన్ లేదా మరెవరైనా హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే ఖర్గ్ ఐలాండ్‌లోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే విషయాన్ని పున:పరిశీలిస్తాం అంటూ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యంతోపాటు వారితో సంబంధాలు కలిగినవారు వెంటనే ఆయుధాలను విడిచిపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే.. ఖర్గ్ ఐలాండ్‌పై దాడి గురించి ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఖర్గ్ ఐలాండ్ ఏమిటి? ఇరాన్‌కు ఎందుకు ప్రత్యేకం..
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ ఐలాండ్ ఉంటుంది. 20 చదరపు కిలో మీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ.. ఇరాన్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెబుతారు. ఎందుకంటే.. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90శాతం వాటా దీనిదే. ఖర్గ్‌లోని లోడింగ్ టర్మినళ్లు రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెప్తున్నాయి.
తొలుత అమెరికా వెనకడుగు..కానీ..
పశ్చిమాసియాలో యద్ధం ప్రారంభమైన తరువాత ఖర్గ్ ఐలాండ్ పై దాడులు చేసి అక్కడి చమురు కేంద్రాలపై దెబ్బకొడితే ఇరాన్‌ను యుద్ధంలో సునాయాసంగా ఓడించవచ్చునని భావించారు. అయితే, ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేస్తే ఇరాన్‌ను దెబ్బతీయవచ్చునన్న విషయం నిజమైనప్పటికీ, ఈ చర్య అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 110 నుంచి 115 డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడవు ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు జరిగితే.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఖర్గ్ ఐలాండ్ హార్ముజ్ జలసంధికి అతి సమీపంలో ఉంటుంది. దీనిపై దాడులు జరిగితే ఇంధన నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరగొచ్చు. దీంతో ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలో ఖర్గ్ ఐలాండ్‌లోని సైనిక కేంద్రాలపై ట్రంప్ సైన్యం దాడులు చేసింది. ఇరాన్ హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకునే విషయంలో వెనక్కు తగ్గకుంటే ఖర్గ్ ఐలాండ్ లోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరి ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
