Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న మొదటి విమానం.. 360 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి

ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్.

Operation Kaveri: సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి 360 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. సూడాన్‭లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే మొదటి విమానం ఇండియాకు చేరుకుంది.

Parkash Singh Badal: అంత్యక్రియల కోసం స్వగ్రామానికి బాదల్ భౌతికకాయం

కాగా, ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన భారతీయుల ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ “భారతదేశం తన ప్రజలను తిరిగి స్వాగతించింది. ఆపరేషన్ కావేరి (#OperationKaveri) మొదటి విమానం న్యూఢిల్లీకి చేరుకుంది. మొదటి బ్యాచులో భాగంగా 360 మంది భారతీయ జాతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది” ట్వీట్ చేశారు.


సూడాన్‭లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశం రప్పించడం కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం హైలెవెల్ మీటింగ్ జరిగింది. అనంతరం సౌది అరేబియా ప్రభుత్వంతో కేంద్ర మంత్రి జయశంకర్ మాట్లాడి, ఆపరేషన్ కావేరి ప్రారంభించారు. ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్.

ట్రెండింగ్ వార్తలు