Covid Parkinsons Disease : పార్కిన్సన్‌ను పసిగట్టే యాప్‌.. వాయిస్ తో వ్యాధి గుర్తింపు

నలభై ఏళ్లు దాటిన వారిలో పార్కిన్సన్‌ వ్యాధి మెల్లిమెల్లిగా శరీరమంతా వ్యాపిస్తుంది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏళ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Covid Parkinsons Disease : నలభై ఏళ్లు దాటిన వారిలో పార్కిన్సన్‌ వ్యాధి మెల్లిమెల్లిగా శరీరమంతా వ్యాపిస్తుంది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏళ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే సమస్యను అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి చాప కింద నీరులా శరీరమంతా వ్యాపిస్తోంది.

ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించటం సాధ్యం కావటం లేదు.  ఈ సమస్యను అధిగమించే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలాంటి స్కానింగ్‌ల అవసరం లేకుండానే మాట ద్వారానే వ్యాధిని గుర్తించే యాప్‌ను ఎంఆర్‌ఐటీ యూనివర్సిటీ అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి ఏ, ఓ, ఎమ్‌ అక్షరాలను పలికితే.. ఆ ధ్వనిలో తేడాలను గుర్తించి, వ్యాధి ఉన్నదా? లేదా? అన్నది చెప్తుంది.

Dementia : పుతిన్‌‌కు పార్కిన్సన్ వ్యాధి.. బ్రిటన్ మీడియా ఆరోపణలు

పార్కిన్సన్‌తో పాటు కరోనా తీవ్రతను కూడా గుర్తించేలా ఈ యాప్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఐఈఈఈ జర్నల్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లొకేషన్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు