ఇద్దరు కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. ప్రపంచ వ్యాప్తంగా వీడియో వైరల్

Viral Video: అతడు కొడుతుంటే తలకు గాయం కాకుండా ఓ యువకుడు అడ్డుగా చేతులు...

ఆఫ్రికా నుంచి ఉపాధి కోసం వచ్చి చైనాలో పనిచేసుకుంటున్న ఇద్దరు కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు ఓ మేనేజర్. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూశారు. ఆ చైనా వ్యక్తి ప్రదర్శించిన జాత్యాహంకారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ప్రముఖ జర్నలిస్ట్ డోమ్ లూక్రే ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్మికులకు ఆ చైనా కంపెనీ మేనేజర్ “ట్రాన్స్-అట్లాంటిక్ బానిసలు” లాగా పరిగణిస్తున్నట్లుందని డోమ్ లూక్రే చెప్పారు. వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం.. ఇద్దరు యువకులు కంటైనర్‌లో కూర్చున్నారు.

వారిని తిడుతూ చైనా కంపెనీ మేనేజర్ ఓ బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. అతడు కొడుతుంటే తలకు గాయం కాకుండా ఓ యువకుడు అడ్డుగా చేతులు పెట్టుకున్నాడు. కొట్టొద్దని ఆ ఇద్దరు యువకులు వేడుకుంటున్నప్పటికీ కనికరం లేకుండా కొట్టాడు చైనా వ్యక్తి.

చివరకు ఓ యువకుడికి కాలితో తన్ని వెళ్లిపోయాడు. చైనా వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బానిసత్వం, జాత్యాహంకారాలు ఇంకెప్పుడు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇక్కడ ఒక్క ప్లేట్ పానీ పూరీని ఎన్ని వందల రూపాయలకు అమ్ముతున్నారో తెలుసా?