Nepal Flash Back: ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన నేపాల్ రాజు స్టోరీ.. అప్పుడు ఏం జరిగింది?
2001లో నేపాల్ రాజ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన యువరాజు దీపేంద్ర కథ ఇదే. మహారాజు బీరేంద్ర, మహారాణి ఐశ్వర్యతో పాటు రాయల్ ఫ్యామిలీ మరణం వెనక నిజం ఏమిటి? దేవయాని రాణా ప్రేమ కథ, నేపాల్ రాజకీయాలపై ప్రభావం తెలుసుకోండి.

Nepal king Birendra Bir Bikram Shah Dev Family Photo
Nepal Royal Family Massacre: నేపాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అక్కడి ప్రభుత్వాన్ని దించేసి మళ్లీ రాచరిక పాలన తేవాలని జెన్ జీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. ఇలాంటి సమయంలో పాత కథలు కొన్ని మళ్లీ బయటకు వస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన నేపాల్ రాజు కథ అందులో చాలా ముఖ్యమైంది. ఆ దేశ చరిత్రలో నెత్తుటి అధ్యాయాన్ని లిఖించిన స్టోరీ ఇది.
అది 2001 సంవత్సరం జూన్ 1. నేపాల్ రాజు ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేశారు. మహారాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా దేవ్ పార్టీ ఇస్తున్నారు. ఆయనతో పాటు మహారాణి ఐశ్వర్య రాజ్యలక్ష్మి దేవి షా కూడా ఉన్నారు. వారితో పాటు యువరాజు దీపేంద్ర షా, చిన్న యువరాజు నిరంజన్, యువరాణి శ్రుతి కూడా వారితో ఆ పార్టీలో ఉన్నారు.
పార్టీ మొదలైంది. అతిథులు మద్యం సేవిస్తున్నారు. అప్పటి వరకు అక్కడున్న యువరాజు దీపేంద్ర సడన్ గా లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత కమాండో డ్రెస్సులో బయటకు వచ్చాడు. తనతోపాటు గన్ కూడా తెచ్చాడు.
అతిథులతో మాట్లాడుతున్న తండ్రి వైపు చూశారు దీపేంద్ర. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రి మీద కాల్పులు జరిపాడు. అంతే మహారాజు కుప్పకూలిపోయాడు. ఆయన నోటి నుంచి వచ్చిన చివరి మాట ‘ఎంత పని చేశావ్?’.
ఆ తర్వాత తల్లి మీద కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయింది. చిన్న యువరాజు, యువరాణిలను కూడా కాల్చేశాడు. వారితోపాటు మరో ఐదుగురు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కాల్పులు జరిపాడు. అంతా చనిపోయారు. అనంతరం తనను తాను కణతకు గురిపెట్టి కాల్చుకున్నాడు. దీపేంద్ర అప్పుడే చనిపోలేదు. కోమాలోకి వెళ్లాడు. జూన్ 4న మరణించాడు.

King Birendra and Queen Aishwarya
దీపేంద్ర అసలు ఎందుకు ఈ కాల్పులు జరిపాడు?. దీనికి చాలా థియరీలు వచ్చాయి. అందులో అత్యంత ముఖ్యమైంది.. అందరూ నమ్మేది.. అతను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే.
దీపేంద్ర, నేపాల్ లో రాజకీయ కుటుంబానికి చెందిన దేవయాని రాణాను ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు ఉషా రాజేసింధియా, పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణా. ఈ ఉషా రాజేసింధియాకి ఇండియాకు లింక్ ఉంది. ఆమె గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన మాధవరావ్ సింధియా, వసుందరా రాజే సింధియాలకు బంధువు.
దీపేంద్ర.. దేవయానిని యూకేలో కలిశాడు. రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి పెళ్లికి మహారాజు, మహారాణి ఒప్పుకోలేదు. అందుకు అతను వారిని చంపేశాడు.

Nepal’s Crown Prince Dipendra
దీనికి సంబంధించి మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. దేవయాని రాణా ఫ్యామిలీ.. నేపాల్ రాజకుటుంబం కంటే కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది. ఒకవేళ ఆమె దీపేంద్రను పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆమె లైఫ్‌స్టైల్ మొత్తం తగ్గించుకోవాల్సి వస్తుందని చెప్పారనే వాదన ఉంది.
2001లో రాజకుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత దీపేంద్ర అంకుల్ పగ్గాలు చేపట్టారు. 2008 వరకు ఆయన రాజ్యం నడిచింది. కానీ, 2008లో ఆయన్ను దించేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ రాచరికపు పాలన కావాలంటూ జెన్ జీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడం వెనక దీపేంద్ర అంకుల్ పాత్ర ఉందని ఈ మధ్య తన పదవికి రాజీనామా చేసిన నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ ఆరోపించారు.
Also, Read:
డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య.. యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో షూటింగ్..