ఇక్కడ ఒక్క ప్లేట్ పానీ పూరీని ఎన్ని వందల రూపాయలకు అమ్ముతున్నారో తెలుసా?

Viral Pic: సాధారణంగా రూ.20-రూ.50 మధ్య దొరికే పానీ పూరీ రేటు మరీ ఇంతగా పెంచేసి అమ్ముతుంటే..

ఇక్కడ ఒక్క ప్లేట్ పానీ పూరీని ఎన్ని వందల రూపాయలకు అమ్ముతున్నారో తెలుసా?

Pani puri

ముంబై పేరు చెబితేనే అక్కడి ధరలు గుర్తుకువస్తాయి. సామాన్యుడు ఏ ఆహార పదార్థాన్నీ.. ఏ వస్తువునీ కొనుక్కోలేని విధంగా ఉంటాయి. హైదరాబాద్‌లో ప్లేట్ పానీ పూరీ తింటే బిల్లు రూ.20-రూ.50 మధ్యే ఉంటుంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ప్లేట్ పానీ పూరీని రూ.333కు అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కౌశిక్ ముఖర్జీ అనే ‘ఎక్స్’ యూజర్ పోస్ట్ చేశాడు. దీని ధర ఇంతగా ఉంటుందని తాను అనుకోలేదని తెలిపాడు.

పానీ పూరీ మాత్రమే కాదు దహీ పూరీ, సెవ్ పూరీ వంటి ఇతర చాట్ ఐటమ్స్ కూడా రూ.333కు అమ్ముతున్నారు. పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. అమ్మాయిలు మరింత ఇష్టపడి తింటారు. సాధారణంగా రూ.20-రూ.50 మధ్య దొరికే పానీ పూరీ రేటు మరీ ఇంతగా పెంచేసి అమ్ముతుంటే అడిగే నాథుడే లేడా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కౌశిక్ ముఖర్జీ పోస్ట్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బయట చాలా చవకగా దొరికే పానీ పూరీ లోపలికి వెళ్లే సరికి మాత్రం ఇంత ఖరీదైన తినుభండారంగా ఎలా మారిపోతుందని కొందరు కామెంట్లు చేశారు.

Also Read: తరగతి గదిలోనే ఫైటింగ్ చేసుకున్న ఇద్దరు టీచర్లు.. ఎందుకంటే?