Russia : రష్యాలో వరుసగా మూడో రోజు కోవిడ్ విజృంభణ..ఒక్కరోజే వెయ్యికి పైగా మరణాలు

రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి.

Russia   రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రష్యాలో రికార్డు స్థాయిలో 33,208 కొత్త పాజిటివ్ కేసులు, 1002 కోవిడ్ మరణాలు నమోదైనట్లు ఆ దేశ ప్రభుత్వం శనివారం వెల్లడించింది.

అయితే వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత మొదటిసారిగా ఒక్కరోజులో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక,రష్యాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంగా చాలా నెమ్మదిగా సాగుతుంది. కేవలం 31శాతం మంది రష్యనకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయింది. దీనికి తోడు కఠినమైన ఆంక్షల కొరత.. కరోనావైరస్ విజృంభణకు కారణమైంది.

దేశవ్యాప్తంగా మరోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించేందుకు రష్యా ప్రభుత్వం ఇటీవల విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే రష్యాలో మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు 80 లక్షల కేసులు నమోదు కాగా.. 2,22,315 మరణాలు సంభవించాయి.

ట్రెండింగ్ వార్తలు