Rs 1 Crore Bull : ఒక్క ఎద్దు ధర రూ. కోటి.. అందుకే అంత డిమాండ్

మీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు.

Hallikar breed bull valued Rs 1 Crore : మీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు. మన దేశంలో పాడి, పశువులు గురించి చెప్పుకుంటే మేలు జాతివే ఎక్కువగా ఉంటాయి. అటువంటి మేలు జాతి పశువులు భారీ ధర పలుకుతాయి. ముఖ్యంగా పెద్ద రైతులు అటువంటి పశువుల్ని ప్రతిష్టాత్మకంగా పెంచుతుంటారు. కొంటుంటారు. అలా ఇదిగో ఈ ఎద్దు అటువంటిదే. అరుదైన మేలు జాతికి చెందినది అంటుకే రూ.1 కోటి ధర..మరి ఇంతకీ ఈ ఎద్దుకు ఇంత ధర ఎందుకు అంటూ అటువంటి మేలు జాతి సంతతి పెంచటానికి ఈ ఎద్దు వీర్యం ఉపయోగపడుతుంది. అలా దీని ధర ఓ రేంజ్ లో పలికింది.

ఆ ఎద్దు హ‌ల్లిక‌ర్ జాతికి చెందిన‌ది. ఆ ఎద్దు పేరు కృష్ణ‌. వయస్సు 3.5 సంవత్సరాలు. బెంగ‌ళూరులో ఇటీవ‌ల జ‌రిగిన కృషి మేళాలో అదే ‘కృష్ణ’ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కృష్ణ యజమాని పేరు బోరెగౌడ. తన కృష్ణ గురించి చాలా గొప్పగా చెబుతారు బోరెగౌడ మా కృష్ణ హల్లికర్ జాతికి చెందినవాడు. ఎద్దుల్లో అంత్యంత మేలు జాతి హల్లికర్. ఈ జాతి ఎద్దులు చాలా అరుదుగా ఉంటాయ‌ని తెలిపారు.

Read more : ఒక ఆవు ధర రూ.2.61 కోట్లు..ప్రపంచ రికార్డు సృష్టించిన గోమాత

హల్లికర్ జాతి ఎద్దు అరుదు కాబ‌ట్టి.. దాని వీర్యానికి ఫుల్ డిమాండ్. ఒక్క డోస్ వీర్య ధర అక్షరాలా రూ.1000. అలా కృష్ణ వీర్యాన్ని బోరెగౌడ అమ్ముతుంటారు. అలా ఈ కృషి మేళాలో 550 స్టాల్స్ లో పశువుల ప్రదర్శన జరుగగా..‘కృష్ణ’ సెంటారాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మేళాకు వచ్చినదరి చూపు కృష్ణ పైనే ఉంది. ఈ క్రమంలో కృష్ణ వీర్యంకోసం 12,000 మంది రైతులు రిజిస్టర్ చేయించుకున్నారు. అదే మరి కృష్ణగారి స్పెషల్.

Read more : Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

కృషి మేళాకు 56 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మేళాలో చరిత్రలో ఈ ఏడాది 300 మంది పశువుల పెంపకందారులు పాల్గొన్నారు. అలాగే వ్యాపారులు కూడా పాల్గొన్నారు. ఒకే వేదికపై ఇంతమంది పాల్గొనడం ఇదే తొలిసారి.గత సంవత్సరం, COVID-19 పరిమితి కారణంగా మేళాకు పరిమిత సందర్శకులు మాత్రమే ఉన్నారు. కానీ ఈ ఏడాది కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టటంతో కృషి మేళా గ్రాండ్ గా జరిగింది.

 

ట్రెండింగ్ వార్తలు