లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం నేడే ఓటింగ్.. వైసీపీ ఎంపీల మద్దతు వారికే

లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.

Lok Sabha Speaker Election

Lok Sabha Speaker election : అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 18వ పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. దీంతో ఇవాళ (బుధవారం) ఉదయం 11గంటలకు లోక్ సభ స్పీకర్ ఎంపికపై ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కేరళ ఎంపీ కే. సురేష్ బరిలో ఉన్నారు.

Also Read : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!

లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది. అయితే, వైసీపీ మద్దతు ఎన్డీయేకి అని తేలింది. స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకే వైసీపీ ఎంపీలు ఓటు వేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధానంగా ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 21 సీట్లు గెలుచుకోగా, వైసీపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

Also Read : బీఆర్ఎస్‌లో చివరికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ దళంలో వలసల గుబులు

స్పీకర్ ఎన్నికల్లో మద్దతుకోసం వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. తమ మద్దతు ఎన్డీయే అభ్యర్థికి ఉంటుందని బీజేపీకి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభలో వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. గతంలో వైసీపీకి 22 ఎంపీలు ఉన్న సమయంలోనూ పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఏపీలో, కేంద్రంలో టీడీపీ భాగస్వామిగాఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నా తమ మద్దతు ఎన్డీయేకే అని వైసీపీ చెప్పడం గమనార్హం. అయితే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి వైసీపీ దూరంగా ఉంటూ వస్తుంది.