ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు.. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని

Arvind Kejriwal

CBI Arrests Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తీహార్ జైలులో కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడి. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ ను సీబీఐ హాజరుపరచనుంది.

Also Read : బీఆర్ఎస్‌లో చివరికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ దళంలో వలసల గుబులు

కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు.. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ట్రయల్ కోర్టులో కోరనున్నారు. ప్రస్తుతం ఈడీ కేసులో భాగంగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ.. అనంతరం వారం రోజుల తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలై, బెయిల్ ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2న మధ్యాహ్నం తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.

Also Read : టార్గెట్ వైసీపీ టాప్ లీడర్లు..! శ్వేతపత్రాల వెనుక చంద్రబాబు వ్యూహం అదేనా..?

ట్రయల్ కోర్టు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు గత గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ (బుధవారం) విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో విచారణకు ముందే సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ ను అధికారులు హాజరుపర్చనున్నారు. దీంతో ఈ కేసులో ఆయన్ను అధికారికంగా అరెస్టు చేశారు.