750 Farmers Died : ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం స్పందించనేలేదు : బీకేయూ నేత రాకేశ్ తికాయిత్‌

ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

750 Died During Farmers Protest : రైతులు చేపట్టిన ఉద్యమంలో 750 మంది రైతులు మృతి చెందినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని..కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం (నవంబర్ 7,2021) టికాయత్ మాట్లాడుతు..వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు నెలల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటం లేదని ఇదో విషయమే కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంలో మా సాటి రైతుల్ని పోగొట్టుకోవటం ఎంతో బాధకలిగిస్తోందని ఆవేదన చెందారు.

Read more : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం..భద్రతా దళాల మోహరింపు..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

రైతు‘ఉద్యమంలో దాదాపు 750 మంది రైతులు మృతి చెందారు. గర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఎలాంటి సంతాపం లేదు’ అని ఆయన ప్రభుత్వంపై ఆరోపించారు. ప్రధాని కేవం కార్పొరేటర్లకు కాదు రైతులకు కూడా ప్రధానినే అనే విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.ఆయన భారతీయులందరికి ప్రధాని అని భావించటంలేదని..రైతుల కష్టాల్ని పట్టించుకోకుండా రైతులను వేరుగా చూస్తున్నారని టికాయిత్‌ అన్నారు. ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ రైతులు నిరసన ప్రదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లరని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం ఐదేళ్లపాటు నడపగలిగితే.. భారత ప్రభుత్వం ఎంఎస్‌పీకి భరోసా ఇచ్చే చట్టాన్ని ఆమోదించి, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ప్రజల ఆమోదంతో నిరసన కొనసాగుతుందని టికాయత్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

Read more :  Delhi ఉద్యమంలో అలసిపోతున్న రైతుల కోసం ‘ఫ్రీ’ మసాజ్‌ సెంటర్లు : అన్నంపెట్టే అయ్యలకు మద్దతు

నెలల తరబడి కుటుంబాలను కూడా వదిలేసి రోడ్లమీద నిరసనలు వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా? సామాన్యులకు మేలు చేయని ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. రైతులు తమ డిమాండ్స్ నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు. నిరసన ప్రదేశాలను వదిలేది లేదు అని తేల్చి చెప్పారు. కాగా 2020 నవంబర్ నుంచి రైతు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు