Arvind Kejriwal: ఢిల్లీలో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్’… ప్రకటించిన కేజ్రీవాల్

జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది.

Arvind Kejriwal: దేశంలోనే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ ఢిల్లీలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాల్ని కేజ్రీవాల్ మీడియాకు వివరించారు. ‘‘దేశంలో ఎప్పుడూ లేనంత ఘనంగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నాం.

SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది. భవిష్యత్తులో ఈ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్‌గా తీర్చిదిద్దుతాం. షాపింగ్ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాల్సిందిగా ఢిల్లీలోని హోటల్స్, ఎయిర్ లైన్స్ సంస్థలను కోరుతున్నాం. దీనిపై ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. డిస్కౌంట్లు అందించమని అడుగుతున్నాం. ఈ ఫెస్టివల్ కోసం ఢిల్లీ నగరాన్ని కొత్త పెళ్లి కూతరులా ముస్తాబు చేస్తాం.

LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు

షాపింగ్‌తోపాటు ఆధ్యాత్మికత, వెల్‌నెస్, హెల్త్, గేమింగ్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి కూడా ఏర్పాటు చేస్తాం. ప్రారంభ, ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు 200 వరకు కన్సర్ట్స్ నిర్వహిస్తాం. స్పెషల్ ఫుడ్ దొరికేలా చూస్తాం. ఢిల్లీలోని వ్యాపారులకు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఇదో మంచి అవకాశం. ఢిల్లీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టవచ్చు. ఢిల్లీకి ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు