AP Elections 2024 : ఏపీలో పోలింగ్‌కు అంతా సిద్ధం.. పోలీసు బలగాలతో భారీగా బందోబస్తు.. : డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

రాష్ట్ర పోలీసులకు అదనంగా సీఏపీఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎస్సీసీ కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఎక్స్ సర్వీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను ఉపయోగిస్తామని చెప్పారు.

Andhra Pradesh Elections 2024 _ Security Tightened with police forces for Poll Day

AP Elections 2024 : ఏపీలో పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ స్థానాల్లో 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 8 లక్షల 7వేల 256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (మే 13న) జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్టు రాష్ట్ర డిజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసులకు అదనంగా సీఏపీఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎస్సీసీ కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఎక్స్ సర్వీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను ఉపయోగిస్తామని చెప్పారు.

  • సివిల్ పోలీసులు : 58948
  • (సివిల్+ఏఆర్+హెచ్‌జీఎస్) : 45960
  • కర్నాటక రాష్ట్ర పోలీసులు : 3500
  • తమిళనాడు పోలీసులు : 4500
  • హోం గార్డ్స్ : 1622
  • వివిధ విభాగాలు, డిప్యూరేషన్ సిబ్బంది : 3366

అర్మేడ్ బలగాలు :

  • ఏపీఎస్పీ (ప్లటూన్స్) : 92
  • సీఏపీఎఫ్ (ప్లటూన్స్) : 295

ఇతర బలగాలు : 18609

Read Also : Allu Arjun Nandyal Tour : నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం