Allu Arjun Nandyal Tour : నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం
Allu Arjun Nandyal Tour : ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖా పరమైన విచారణ జరపాలని, ఎస్పీతోపాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది.

Action Against Nandyal SP
Allu Arjun Nandyal Tour : నంద్యాల పోలీసులకు అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్ పడింది. 144 సెక్షన్ ఉన్నప్పటికీ, జన సమీకరణ జరగడంపై ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖా పరమైన విచారణ జరపాలని, ఎస్పీతోపాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. నంద్యాల ఎస్పీ రఘవీరా రెడ్డితో పాటు ముగ్గురు పోలీసు అధికారులపై కూడా చర్యలకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.
Read Also : ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశాం: డీజీపీ రవి గుప్తా
ఎన్నికల కోడ్ అమలు చేయటంలో విఫలమయ్యారంటూ నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై అభియోగాలు మోపాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు ఎస్డీపీఓ రవీంధ్రనాథ్ రెడ్డి, నంద్యాల 2 టౌన్ సీఐ రాజారెడ్డిపైనా ఈసీ చర్యలకు ఆదేశించింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా జనం పోగవ్వటం, సరిగా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవటంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరందరిపైనా శాఖా పరమైన విచారణ జరపాల్సిందిగా ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. ఇవాళ రాత్రిలోగా వీరిపై తీసుకున్న చర్యల నివేదిక పంపాల్సిందిగా డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది.
జిల్లా నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అభినందనలు తెలిపేందుకు వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. స్నేహితుడు శిల్పా రవి ఇంటికి వెళ్లిన సమయంలో భారీగా జన సమీకరణ జరిగింది. గంటన్నరకుపైగా ఆయన అక్కడే ఉండి ర్యాలీ నిర్వహించడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం.. అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే