PMAY Scheme: పీఎంఏవై గ్రామీణ్ 2.0 పథకంలో నిర్మించే ఇళ్ల యూనిట్ ధర ఖరారు
యూనిట్ కాస్ట్ లో భాగంగా ఎస్ హెచ్ జీ సభ్యులకు 3 శాతం వడ్డీ రాయితీతో 80వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Representative Image (Image Credit To Original Source)
PMAY Scheme: పీఎంఏవై గ్రామీణ్ 2.0 పథకంలో నిర్మించే ఇళ్ల యూనిట్ ధర ఖరారైంది. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధరను 2 లక్షల 39 వేలుగా నిర్ణయించింది ప్రభుత్వం. పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద మంజూరైన ఇళ్లకు యూనిట్ ధర వర్తింపజేస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి మొత్తం రూ2.39 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కేంద్రం వాటా రూ.95,400… రాష్ట్రం వాటా రూ.63,600.
యూనిట్ కాస్ట్ లో భాగంగా ఎస్ హెచ్ జీ సభ్యులకు 3 శాతం వడ్డీ రాయితీతో 80వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్ కాస్ట్ లో భాగంగా జీ రామ్ జీ కన్వర్జెన్స్ కింద ఒక్కో లబ్దిదారుడికి రూ.27 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. యూనిట్ కాస్ట్ లో భాగంగా ఎస్ బీఎం (గ్రామీణ్ )-ఐహెచ్ హెచ్ఎల్ కింద 12 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: పోలీసులను గాయపరిచి పారిపోవాలని ప్లాన్..! మొయినాబాద్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
