OnePlus Nord CE 6 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్ ఇంత తక్కువా..? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
OnePlus Nord CE 6 : వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 5జీ ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 35,999కి తగ్గింది. పూర్తి ఫోన్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
OnePlus Nord CE 6
OnePlus Nord CE 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారీ బ్యాటరీతో 5జీ ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెటర్ టైమ్.. వన్‌ప్లస్ నార్డ్ CE6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
సాధారణంగా ఈ ఫోన్ ధర రూ. 40వేల కన్నా ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం ఈ డివైస్‌పై ఫ్లాట్ 12శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా ధర మరింత తగ్గుతుంది. ఈ డీల్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ CE6పై తగ్గింపు ఆఫర్లు :
వన్‌ప్లస్ అద్భుతమైన 5జీ ఫోన్ అసలు ధర రూ.40,999 కాగా, ప్రస్తుతం ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా కేవలం రూ. 35,999కే కొనేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
Read Also : Jio vs Airtel : ఒకే ధర.. 30 రోజుల వ్యాలిడిటీ! జియో, ఎయిర్‌టెల్‌లో బెనిఫిట్స్ ఒకటేనా? ఏది బెటర్?
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో సహా పలు బ్యాంక్ కార్డ్‌లపై ఈఎంఐ ఆప్షన్లతో ఈ డివైస్‌పై రూ. 2వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
అంతేకాదు.. ఈ ఫోన్‌పై స్పెషల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. తద్వారా మీ పాత ఫోన్‌ను రూ. 26,700 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, ఈ వాల్యూ అనేది పూర్తిగా మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్పైనే ఆధారపడి ఉంటుంది.
స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 5జీ అనేది మిడ్-రేంజ్ ఫోన్. ఇందులో 6.78-అంగుళాల 1.5K 144Hz అమోల్డ్ డిస్ప్లే ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 8,000mAh బ్యాటరీ, OISతో 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.
