Tom Cruise : వరుస హిట్స్‌లో ఉన్న హాలీవుడ్ స్టార్ హీరో.. ముసలి వేషంతో సినిమా.. ఏకంగా 2000 కోట్ల నష్టం..
ఇటీవల టామ్ క్రూజ్ బాగా ముసలి పాత్రలో డిగ్గర్ అనే ఓ సినిమా చేసాడు. (Tom Cruise)
Tom Cruise
Tom Cruise : మన దగ్గర సినిమా లాస్ అయితే మహా అయితే వందల కోట్లలోనే ఆగిపోతుంది. కానీ హాలీవుడ్ లో సినిమా ఫ్లాప్ అయితే వేల కోట్లు నష్టపోవాల్సింది. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ ఇప్పుడు ఏకంగా 2000 కోట్లకు పైగా నష్టాన్ని చూస్తున్నాడు. మిషన్ ఇంపాజిబుల్, టాప్ గన్.. లాంటి పలు యాక్షన్ సినిమాలతో ఇండియాలో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్.
ఇటీవల టామ్ క్రూజ్ బాగా ముసలి పాత్రలో డిగ్గర్ అనే ఓ సినిమా చేసాడు. ఓ ధనవంతుడు తన డబ్బు దాహం తీరక గ్రీన్ లాండ్ ని కూడా నాశనం చేయడం, ప్రకృతి వైపరీత్యాలకు కారణం అవ్వడం.. అనే కథాంశంతో ఆస్కార్ అవార్డు గ్రహీత అలెజాండ్రో ఇనారిట్టు దర్శకత్వంలో సినిమా చేసాడు. టామ్ క్రూజ్, ఆస్కార్ దర్శకుడు సినిమా కావడంతో రిలీజ్ కి ముందు అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ రిలీజ్ అయినా తర్వాత ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
Also Read : Vangalapudi Anitha : టీవీ షోలో ఏపీ హోమ్ మినిస్టర్.. డ్యాన్స్ వేసి సందడి చేసిన వంగలపూడి అనిత.. ప్రోమో వైరల్..
ఈ సినిమాకు ఏకంగా 150 మిలియన్ డాలర్ల బడ్జెట్ పెట్టడంతో పాటు 100 మిలియన్ డాలర్లు మార్కెటింగ్ కోసం ఖర్చు చేసారు. డిగ్గర్ సినిమా అక్టోబర్ 2న విడుదల అయింది. సాధారణంగానే టామ్ క్రూజ్ సినిమా అంటే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. ఇండియాలోనే అతని సినిమాలు వందల కోట్లు వసూలు చేసాయి. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ కేవలం 20 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటికి కూడా ఫ్లాప్ టాక్ ఉండటంతో సినిమాకు అంతగా కలెక్షన్స్ రావట్లేదు. ఇండియాలో అయితే ఈ సినిమాని పట్టించుకునే నాధుడే లేదు.
దాంతో డిగ్గర్ సినిమాకు దాదాపు 200 మిలియన్ డాలర్లకు పైగా అంటే కనీసం 2000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని హాలీవుడ్ అంచనా వేస్తున్నారు. దీంతో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న టామ్ క్రూజ్ ముసలి వేషం వేసి కష్టపడినా కూడా హిట్ అవకపోగా ఇంత నష్టం మిగల్చడంతో హాలీవుడ్ సైతం షాక్ లో ఉంది.
Also See : Viraajita : పొట్టి స్కర్ట్‌లో యూట్యూబర్ విరాజిత.. ఫోటోలు వైరల్..
