Vivo Y32 Launch : కొత్త వివో ఫోన్ కేక.. భారీ బ్యాటరీతో దుమ్మురేపుతోంది.. ధర మీ బడ్జెట్లోనే..
Vivo Y32 Launch : వివో Y32 లాంచ్ అయింది. 6.87 అంగుళాల డిస్ ప్లే, 8000mAh భారీ బ్యాటరీతో వచ్చేసింది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..
Vivo Y32 Launched
- వివో Y32 సన్‌సెట్ ఆరెంజ్ ట్వైలైట్ రెడ్ కలర్ ఆప్షన్లు
- డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6
Vivo Y32 Launch : వివో నుంచి కిర్రాక్ ఫోన్ వచ్చేసింది. వివో Y32 ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ సరికొత్త వివో వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8,000mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ ఛార్జ్‌పై 59 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది. వివో Y32లో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69-రేటెడ్ బిల్డ్ అందిస్తుంది.
వివో వై32 ధర ఎంతంటే? :
బంగ్లాదేశ్‌లో వివో Y32 ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర BDT 30,999 (సుమారుగా రూ. 24,300) అందిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో టాప్-ఎండ్ వేరియంట్ ధర BDT 34,999 (సుమారుగా రూ. 27వేలు). సన్‌సెట్ ఆరెంజ్ ట్వైలైట్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో Y32 స్పెసిఫికేషన్లు :
వివో Y32 ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ (నానో)కు సపోర్టు ఇస్తుంది. ఇందులో 6.87-అంగుళాల HD (1,592×720 పిక్సెల్స్) ఎల్సీడీ ప్యానెల్ అందిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ 255ppi పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
ఈ డిస్ప్లే 83 శాతం NTSC కలర్ గామట్ 1,300 నిట్స్ వరకు HBM బ్రైట్నెస్ అందిస్తుంది. వివో Y32లో 6nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7300 చిప్సెట్, 6GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 2.2 లేదా eMMC 5.1 స్టోరేజ్ ఉన్నాయి.
Read Also : Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్ ఆఫర్ అదిరిందిగా.. ఈ శాంసంగ్ అల్ట్రా 5Gపై ఏకంగా రూ.51,000 తగ్గింపు..
ఈ హ్యాండ్సెట్ 6GB వరకు ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఎఫ్/2.05 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.4, జీపీఎస్, BeiDou, Galileo QZSS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ గైరోస్కోప్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. SGS 5-స్టార్ డ్రాప్-రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా అందిస్తుంది.
వివో వై32లో 44W ఛార్జింగ్‌కు సపోర్టు 8,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 36 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 14 గంటల వరకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ 59 గంటల వరకు 4జీ కాలింగ్ టైమ్ అందిస్తుంది. కొలతలు సుమారుగా 169.55×79.20×8.79mm బరువు 229 గ్రాములు ఉంటుంది.
