Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ కొత్త నైపుణ్యం.. టీమ్ఇండియాలో చోటు కోసమేనా?
రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
Yashasvi Jaiswal wants to keep wickets for Mumbai or go on to do it for India
Yashasvi Jaiswal : రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. వికెట్ కీపింగ్ గ్లౌజులు ధరించిన తన ఫోటోలను స్వయంగా జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
‘యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే అతను వికెట్ కీపింగ్ ప్రారంభించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అతని నుండి నేను విన్నది అదే. అతను ముంబైకి వికెట్ కీపింగ్ చేయాలని లేదా భారత జట్టుకు వికెట్ కీపింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నాడు. అతని లక్ష్యం అదేనని నాకు అనిపిస్తోంది. దీనిపై నాకు ఇంకా స్పష్టత లేదు.’ అని ఈ సీజన్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ముంబై సీనియర్ బ్యాటర్ లాడ్ గురువారం జరిగిన ప్రీ సీజన్ సమావేశంలో చెప్పుకొచ్చాడు. అంతేకాదండోయ్.. 24 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ లెగ్ స్పిన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపాడు.
View this post on Instagram
Kuldeep Yadav : వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీస్తే..
‘బహుశా అతను తన ప్రధాన బలమైన బ్యాటింగ్‌కు మరింత విలువను జోడించాలనుకుంటున్నాడు. మా ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఒకదానిలో అతను వికెట్ కీపింగ్ చేశాడు. అతని ప్రణాళికలు ఏమిటో నాకు తెలియదు కానీ.. మీ ప్రాథమిక క్రికెటింగ్ నైపుణ్యాలకు ఒక కొత్త కోణాన్ని జోడించడం తప్పు కాదు. ఎప్పుడు, ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరికి తెలుసు. అతను ఎలాగూ బ్యాటింగ్ చేస్తాడు, కీపింగ్ అతని క్రికెట్‌కు మరింత విలువను చేకూర్చగలదు.’ అని లాడ్ అన్నాడు.
టీమ్ఇండియాలో స్థానం కోసమేనా?
భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న జైస్వాల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం జట్టులో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఉండటంతో వన్డే జట్టులో అతనికి స్థానం లేదు. ఇక టీ20లో అయితే 15 మంది స్వాడ్‌లో ప్లేస్ కష్టంగా మారింది. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆల్ ఇన్ వన్ ప్లేయర్‌గా తనని తాను తీర్చిదిద్దుకునే పనిలో యశస్వి జైస్వాల్ ఉన్నట్లు అర్థమవుతోంది.
