Kuldeep Yadav : వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీస్తే..
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav ) మూడు వికెట్లు తీస్తే అరుదైన మైలురాయి చేరుకుంటాడు.
IND vs WI 2nd T20 Kuldeep Yadav Need 3 Wickets To Complete 100 Wickets In International T20is
Kuldeep Yadav : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్ నేడు వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. రాంచి మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
అదే జరిగితే.. భారత్ తరుపున టీ20ల్లో వంద వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా కుల్దీప్ రికార్డులకు ఎక్కుతాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 వికెట్లును సాధించారు.
IND vs NZ : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఒకరు కాదు.. ఇద్దరు..
కుల్దీప్ యాదవ్ 2017లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. 6.98 ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు వికెట్ల ఘనత మూడు సార్లు, ఐదు వికెట్ల ఘనత రెండు సార్లు సాధించాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కుల్దీప్ రెండు వికెట్లను పడగొట్టాడు.
భారత్ తరుపున అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 95 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు
* జస్ప్రీత్ బుమ్రా – 100 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 114 వికెట్లు
* అక్షర్ పటేల్ – 108 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు
