Premane Oorilo : సాయి కుమార్ గెస్ట్ గా ‘ప్రేమనే ఊరిలో’ సక్సెస్ మీట్..
ఈ సక్సెస్ మీట్ కి డైలాగ్ కింగ్ సాయికుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. (Premane Oorilo)
Premane Oorilo
Premane Oorilo : శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన కన్నడ సినిమా ‘ప్రేమనే ఊరిలో’ కన్నడలో పెద్ద హిట్ అవ్వడంతో గతవారం తెలుగులో కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మమత దేవేంద్ర ఈ సినిమా నిర్మించగా మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో మహారత్న ప్రొడక్షన్స్, SK పిక్చర్స్ బ్యానర్ పై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి రిలీజ్ చేసారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ కథాంశంతో తెరకెక్కిన ప్రేమనే ఊరిలో సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి డైలాగ్ కింగ్ సాయికుమార్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సక్సెస్ మీట్ లో సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రేమనే ఊరిలో సినిమా ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఇది ప్రతి ఒక్కరూ ప్రేమించే సినిమా, ఎక్సిపీరియన్స్ చేసే సినిమా. మన మట్టి సినిమా. మన ఊరి సినిమా. నేను త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తాను. ఇందులో ఆర్టిస్టులంతా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. కథలో మంచి ఎమోషన్ ఉంది. రైతు గొప్పదనం గురించి చెప్పారు. ఒక్కటని కాదు మనల్ని ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అని అన్నారు.
Also Read : Tom Cruise : వరుస హిట్స్‌లో ఉన్న హాలీవుడ్ స్టార్ హీరో.. ముసలి వేషంతో సినిమా.. ఏకంగా 2000 కోట్ల నష్టం..
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. మా ప్రేమనే ఊరిలో సినిమాకు సాయికుమార్ గారు లాంటి పెద్దల ఆశీర్వాదాలు, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ పొందుతారు ఈ సినిమా చూస్తున్నంతసేపు అని అన్నారు. హీరోయిన్ తపస్విని పునాచ మాట్లాడుతూ.. మా ప్రేమనే ఊరిలో సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మేము థియేటర్ విజిట్స్ చేశాం. ప్రతి థియేటర్ లో ఆడియెన్స్ సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కర్ణాటకలో మంచి విజయం సాధించిన మా సినిమా తెలుగులో కూడా సక్సెస్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

నిర్మాత మమత దేవేంద్ర మాట్లాడుతూ.. మా సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మా బాబాయ్ ద్వారా సురేష్ గారిని కలిశాం. ఆయన ఇక్కడే సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అనుకున్నాం. సినిమా బాగుంది. డబ్బింగ్, సాంగ్స్ ఎవరితో చేయిద్దాం అంటూ మాట్లాడారు. మా మూవీ చూసిన వెంటనే అలా పాజిటివ్ గా మాట్లాడటం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. తెలుగు ఆడియెన్స్ మా సినిమాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు చెబుతున్నా అని తెలిపారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ప్రేమనే ఊరిలో సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్స్, స్క్రీన్స్ పెంచాం. మంచి ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేశారు అని తెలిపారు.
Also Read : Vangalapudi Anitha : టీవీ షోలో ఏపీ హోమ్ మినిస్టర్.. డ్యాన్స్ వేసి సందడి చేసిన వంగలపూడి అనిత.. ప్రోమో వైరల్..
నిర్మాత చందూ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రేమనే ఊరిలో సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా చూశాక మాపై ఎక్కువ గౌరవం కనబరుస్తున్నారు. మాకు గౌరవాన్ని తీసుకొచ్చిన చిత్రమిది. సినిమా చూస్తూ ఆడియెన్స్ ఎమోషనల్ అవుతున్నారు. నేనూ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా అని తెలిపారు.
