Ather EL Electric Scooter : వారెవ్వా.. ఏథర్ ఫస్ట్ EL ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?
Ather EL Electric Scooter : ఏథర్ ఎనర్జీ ఆగస్టు 29న కొత్త ఈఎల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.. పూర్తి వివరాలివే..
Ather EL Electric Scooter
Ather EL Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఫస్ట్ ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. ఆగస్టు 29న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే ఈ స్కూటర్ ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఎలాంటి ఫీచర్లతో రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
డిజైన్, పేటెంట్ :
ఈ స్కూటర్ ఇటీవల టెస్టింగ్‌లో కనిపించింది. 2025లో ఫస్ట్ టైం EL01 కాన్సెప్ట్ పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో డిజైన్ పేటెంట్ కూడా దాఖలు అయింది. టెస్టింగ్ ఫొటోలలో హ్యాండిల్‌బార్‌పై అమర్చిన హెడ్‌లైట్, ఫ్రంట్ ఆప్రాన్పై వెడల్పాటి ఎల్ఈడీ డీఆర్ఎల్ కనిపిస్తున్నాయి.
కొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్ :
450 సిరీస్ తర్వాత ఏథర్ ప్రవేశపెట్టనున్న ఫస్ట్ సరికొత్త ప్లాట్‌ఫామ్ ఈఎల్ ప్లాట్‌ఫామ్. కంపెనీ రాబోయే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ ప్లాట్‌ఫామ్‌పైనే తయారుచేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన స్కూటర్ల ధర రూ. లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉంటుందని అంచనా. బడ్జెట్ మార్కెట్లో ఇతర కంపెనీలతో పోటీగా ఏథర్ ఈ స్కూటర్లను దించుతోంది.
Read Also : Infinix Xpad 30 Pro : 8,200mAh బ్యాటరీతో కొత్త ఇన్ఫినిక్స్ టాబ్లెట్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్!
కొత్త ఫీచర్లు :
ఈ ఏడాదిలో కంపెనీ 450X, 450 అపెక్స్ స్కూటర్ల కోసం ఇన్ఫినిట్ క్రూజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ జనవరి 2025 నుంచి విడుదల కాగా పాత 450X, 450 అపెక్స్ మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. విశాలమైన రోడ్లపై హైస్పీడ్ వెళ్లొచ్చు. కఠినమైన భూభాగాలపై తక్కువ వేగంతో కంట్రోలింగ్ పొందవచ్చు. కొండ ప్రాంతాలలో కూడా ఈజీగా ప్రయాణించవచ్చు.
వాయిస్ ఆన్ అథర్ :
ఈ కొత్త ఫీచర్లలో ‘వాయిస్ ఆన్ ఏథర్’ కూడా ఉంది. తద్వారా రైడర్లు తమ వాయిస్‌తో నావిగేట్ చేయొచ్చు. ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించవచ్చు. స్కూటర్ కీలక ఫంక్షన్లను కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు.. ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్‌తో మరింత ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్ హెల్మెట్ ఎకోసిస్టమ్ మీ ఫోన్, స్కూటర్ డాష్‌బోర్డ్, హెల్మెట్‌ను లింక్ చేస్తుంది. ఇయర్ఫోన్లు లేకుండా ఆడియోను వినొచ్చు.
