Nara Lokesh : జగన్ కోటలో లోకేశ్ మార్క్ రాజకీయం.. తమ్ముళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చినట్లు.?
Nara lokesh : గ్రూపు రాజకీయాలతో.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నమే తప్ప.. పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవడం లేదని గ్రహించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్.. కడప గడ్డపై నుంచే తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Nara Lokesh : కడప జిల్లా. అప్పట్లో కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ఇలాకాలో కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీడీపీ ఐదు, జనసేన, బీజేపీ చెరో చోట గెలిచాయి. వైసీపీ 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, రాయచోటిలో టీడీపీ జెండా పాతింది. జమ్మలమడుగులో బీజేపీ, కోడూరులో జనసేన గెలిచింది, ఇక పులివెందుల, రాజంపేట, బద్వేలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. ఈ సారి ఉమ్మడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనేది టీడీపీ టార్గెట్‌గా చెబుతున్నారు. కానీ అధికారంలోకి ఏడాది నుంచే తమ్ముళ్ల మధ్య వర్గపోరు తలనొప్పిగా మారింది.
Also Read : Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన.. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి.. చంద్రబాబు, లోకేశ్ సీరియస్..
గ్రూపు రాజకీయాలతో.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నమే తప్ప.. పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవడం లేదని గ్రహించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్.. కడప గడ్డపై నుంచే తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గీత దాటితే..గేటు దాటి వెళ్లపోయేందుకు రెడీగా ఉండాలంటూ అల్టిమేటం జారీ చేశారు. పార్టీనే ఫస్ట్..తర్వాతే ఎవరైనా అంటూ.వర్గపోరుతో నష్టం చేస్తామంటూ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని..మొహమాటం లేకుండా ఓపెన్ డయాస్ మీదే తేల్చి చెప్పారు లోకేశ్.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, రాయచోటి, కడప, పులివెందుల, బద్వేలులో పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కాంట్రాక్టులు, ఆధిపత్యం, నామినేటెడ్ పదవుల కోసం తమ్ముళ్లు రచ్చకెక్కుతున్నారు. దీంతో కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను వదిలేసి, సొంత లాభాల కోసం గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదంటున్నారు లోకేశ్. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా పక్కన పెట్టడానికి వెనుకాడమనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. కడప జిల్లాలో బహిరంగ సభలకే పరిమితం కావడం లేదు లోకేశ్. నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో వన్-టు-వన్ భేటీలు కూడా నిర్వహించారు. గ్రూపులు కడితే టికెట్ కట్ అంటూ ఇప్పటికే లీడర్లకు మ్యాటర్ చేరవేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు కావాలన్నా, పదవులు దక్కాలన్నా స్థానికంగా అందరినీ కలుపుకుపోవాల్సిందే అంటున్నారు. లీడర్ల ఇగోల కోసం కార్యకర్తలను ఇబ్బందిపెడితే ఊరుకోనంటున్న లోకేశ్..నేతల పంచాయితీని రోడ్డుపైకి తెస్తే డిసిప్లినరీ యాక్షన్ తప్పదని స్ట్రెయిట్ వార్నింగ్ ఇవ్వడంపై పార్టీలో డిస్కషన్ నడుస్తోంది.
కొందరు నేతలకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో..ఇక సీరియస్ యాక్షన్‌కు రెడీ అవుతున్నారట లోకేశ్. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు వేదికగా తమ్ముళ్లకు అల్టిమేటం ఇచ్చారని అంటున్నారు. తమ్ముళ్ల తగువుతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన యువనేత..కడప గడపలో గేర్ మార్చి పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే పార్టీ ఫస్ట్..లీడర్లు నెక్స్ట్ అని క్యాడర్ మదిని దోచుకునే ప్లాన్స్ వేస్తున్నారట. గ్రూపు పాలిటిక్స్ చేస్తామంటే పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు తలుపులు తెరిచి రెడీగా ఉన్నాయంటూ ప్రొద్దుటూరు కార్యకర్తల సభలో లోకేశ్ ఔట్రైట్ స్టేట్మెంట్ ఇచ్చారు.
వర్గపోరుకు కేరాఫ్‌గా ఉన్న లీడర్లకు లోకేశ్ కామెంట్స్ షాకిచ్చినంత పని చేశాయని అంటున్నారు. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల లీడర్లను ఉద్దేశించే లోకేశ్ ఇలా మాట్లాడారని తెలుగు తమ్ముళ్లు గుసగుసులు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. లీడర్ల అనైక్యత ప్రత్యర్థులకు కలిసి రావడంతోనే కడపలో పట్టు సాధించేందుకు ఇన్నేళ్లు పట్టిందని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. గత ఎన్నికల్లో ఏడు సీట్లు సాధించి..రాబోయే రోజుల్లోనూ ఆ బలాన్ని నిలుపుకుందామంటే తమ్ముళ్ల ఆధిపత్య పోరు హెడెక్‌గా మారిందట. అందుకే లోకేశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. చిన్నబాబు అల్టిమేటంతో తమ్ముళ్ల తీరులో మార్పు వచ్చేనా.? ఎప్పటిలాగే వర్గపోరే ఎజెండాగా ముందుకెళ్తారా అనేది వేచి చూడాలి మరి.
