Bandla Ganesh : కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేష్.. ఫోటోలు వైరల్..
ఆగస్టు 16న బండ్ల గణేష్ (Bandla Ganesh) కూతురు జనని పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని బండ్ల గణేష్ ఆహ్వానించారు. మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.





