Anna Lezhneva : కాలినడకన తిరుమల కొండెక్కిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భార్య.. ఫోటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు.

అంతకముందు అలిపిరి నుంచి కాలినడక మార్గంలో ఆమె తిరుమలకు చేరుకున్నారు.

ఆమెకు శుక్రవారం రాత్రి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

ఆ తరువాత శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు.

భక్తులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరుకునేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని, ఆ ప్రయాణం కాస్త కష్టమైనప్పటికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.












