Telangana : తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల.. డేంజర్లో 92లక్షల మంది ఓట్లు.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..
Telangana Election Commission : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Telangana Election Commission
Telangana Election Commission : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
Also Read : TVK Vijay Government : తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివే..
తెలంగాణ వ్యాప్తంగా 78.30 శాతం ఎన్యుమరేషన్ పత్రాలు అందించినట్లు తెలిపారు. 2.73శాతం మంది చనిపోయిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు సుమారు 60లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని.. అలాగే 32లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించండం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 92లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్న వ్యక్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఉంటుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓటు అయినా లేకపోతే ఫారం -6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన 33 జిల్లాల నివేదిక పరిశీలిస్తే, గ్రామీణ జిల్లాల్లో డిజిటలైజేషన్ వేగంగా సాగగా, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కేవలం 59.01శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో డిజిటలైజేషన్ 65.21శాతం నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 89శాతానికిపైగా డిజిటలైజేషన్ పూర్తయింది.
