The Maze : రివర్స్ టీజర్‌తో ఆకట్టుకుంటున్న ది మేజ్..
హీరో శ్రీరామ్ నటిస్తున్న మూవీ ది మేజ్ (The Maze).
The Maze Reverse Teaser out now
The Maze : హీరో శ్రీరామ్ నటిస్తున్న మూవీ ది మేజ్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శర వేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజాగా రివర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
తొలిసారి రివర్స్ టీజర్‌తో సరికొత్త ప్రయత్నం చేసి ఆకట్టుకున్నారు చిత్ర నిర్మాతలు. కన్ను మూసి తెరిచే సరికి ఈ ప్రపంచం అతన్ని గతాన్ని మాయం చేసింది. అతను మాత్రమే నమ్మే నిజాన్ని కలగా మార్చేసింది అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. నిద్రలోంచి ఉలిక్కి పడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే కొన్ని నిజాలు, వాటి రుజువుల కోసం అతను అన్వేషణ సాగిస్తుంటాడు. టీజర్లో చివరి సీన్ తప్ప మొత్తం రివర్స్ లో ఉండటం ఒక సరికొత్త ప్రయత్నంగా చెప్పవచ్చు. మొత్తంగా టీజర్ అదిరిపోయింది.
