Megaverse : మెగాస్టార్ ‘మెగావర్స్’ షో.. ఆ ఫ్యామిలీ స్పెషల్ ఎపిసోడ్.. షూటింగ్ పూర్తి..
త్వరలోనే ఈ షో నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కి రానుంది. (Megaverse)
Megaverse
Megaverse : మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా మెగావర్స్ అనే పేరుతో ఓ స్పెషల్ షో త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు అధికారికంగానే ప్రకటించారు. చిరంజీవి హోస్ట్ గా, ఆయనకు సాన్నిహిత్యంగా ఉండే పలువురు సెలబ్రిటీలు గెస్ట్ గా ఈ షో సాగనుంది. ఈ షోలో చిరంజీవి కెరీర్, ఆయన సినిమాలు, జ్ఞాపకాలు, రాజకీయ జీవితం.. ఇలా పలు విషయాల గురించి చెప్పబోతున్నారు. అలాగే ఈ షోకి వచ్చే పలువురు సెలబ్రిటీలు చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని పంచుకోబోతున్నారు.
ఈ షోని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. త్వరలోనే ఈ షో నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కి రానుంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించి రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఒక ఎపిసోడ్ కి లోకనాయకుడు కమల్ హాసన్ రాగా మరో ఎపిసోడ్ కి తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న ముగ్గురు స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, సునీల్, సత్యలు వచ్చారని సమాచారం.
Also Read : Deviyanisharma : ‘ఆదర్శకుటుంబం’లో విలన్.. బీచ్లో బోల్డ్ ఫోజులతో దేవియాని శర్మ.. ఫొటోలు వైరల్..
తాజాగా మెగావర్స్ మరికొన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం. ఓ ఎపిసోడ్స్ లో ఒకదానికి అక్కినేని ఫ్యామిలీ గెస్టులుగా హాజరయ్యారట. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్.. ఇలా నలుగురు హాజరయినట్టు తెలుస్తుంది. నాగార్జున – చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. దీంతో మెగాస్టార్ తో ఈ అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి సందడి చేసిందో అని అక్కినేని – కొణిదెల హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ స్పెషల్ ఫ్యామిలీ ఎపిసోడ్ సంక్రాంతి పండగకు స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కమల్ హాసన్ ఎపిసోడ్ ఉండనుంది. మరి ఈ మెగావర్స్ షో ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
