CM Yogi Adityanath: దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తుందా? ఒకరోజుతో ఏమీ కాదు.. సీఎం యోగి సంచలన కామెంట్స్
దీపావళి పండుగనాడు ఒకరోజు బాణసంచా కాల్చడం వల్ల కలిగే కాలుష్యం త్వరగానే తగ్గిపోతుందని, వ్యవస్థను కలుషితం చేసే వారిపై ఎందుకు మాట్లాడరని సీఎం యోగి(CM Yogi Adityanath) ప్రశ్నించారు.
Up cm yogi adityanath strikes back at diwali firecrackers pollution critics
CM Yogi Adityanath: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిందంటూ వస్తున్న ఆందోళనలు, విమర్శలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) తీవ్ర స్థాయిలో స్పందించారు. పండుగ సమయంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా టపాసులు కాలిస్తేనే కొందరికి కాలుష్యం హఠాత్తుగా గుర్తుకొస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకరోజు బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యం చాలా వేగంగా తగ్గిపోతుందని, దీనిపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.
Amit Shah Tour Cancelled: విశాఖలో అమిత్ షా పర్యటన రద్దు.. ప్రభుత్వం తెలిపిన వివరాలు ఇవే!
ఒక్కరోజు టపాసులపైనే విమర్శలా? అవినీతితో వ్యవస్థను కలుషితం చేసినవారిపై ప్రశ్నలేవి?
బుధవారం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. దీపావళి వేడుకలపై తమ ప్రభుత్వం ఎలాంటి నిషేధాలు విధించలేదని తెలిపారు. ప్రజలు ఒకరోజు టపాసులు కాల్చగానే కాలుష్యం గురించి మాట్లాడేవారు, అవినీతి అక్రమాలతో మొత్తం సామాజిక వ్యవస్థను కలుషితం చేసిన వారిని ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. దీపావళి వేడుకల సమయంలో అయోధ్యలో జరిగిన బాణసంచా కాల్చే కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొన్నట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
2017కు ముందు అల్లర్లు ఉండేవి.. ఇప్పుడు పండుగలు ప్రశాంతంగా జరుగుతున్నాయి:
2017కు ముందు ఉత్తరప్రదేశ్లో హోలీ, దీపావళి, విజయదశమి, జన్మాష్టమి, శివరాత్రి, క్రిస్మస్, ఈద్ వంటి పండుగలు వస్తే అల్లర్లు జరిగేవని, ప్రస్తుతం ప్రజలు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారని యోగి వివరించారు. ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటే కాలుష్యం పేరుతో రచ్చ చేస్తున్నారని విమర్శించారు. నేరస్థులు, అవినీతిపరుల తప్పిదాల విషయంలో అదే స్థాయిలో ప్రశ్నలు లేకపోవడం విచారకరమని, పండుగల ఉత్సాహాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని తేల్చిచెప్పారు.
