Vijayasai Reddy Party : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి.. లక్ష్యం ఇదే..
Vijayasai Reddy Party : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.
Vijayasai Reddy Party
Vijayasai Reddy Party : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ పేరు ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)గా ప్రకటించారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ జెండానుసైతం ఆవిష్కరించారు. కాషాయం, తెలుపు రంగులతోపాటు మధ్యలో ధర్మచక్రం గుర్తుతో పార్టీ జెండాను రూపొందించారు.
Also Read : Yathindra Saptati Celebrations : అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ: చిన్న జీయర్ స్వామి
పార్టీ పేరు ప్రకటన, పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడారు. దుర్గమ్మ సాక్షిగా కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఏపీ భవిష్యత్ ఏ ఒక్క నాయకుడి చేతిలోనూ లేదు. మార్పు అనేది ప్రజలతోనే సాధ్యమవుతుంది. మంచి ఎవరు చేసినా అభినందించాలి. తప్పు ఎవరు చేసినా ఆధారాలతో ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది ప్రజల హక్కు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. యువత నాయకత్వాన్ని పీఆర్పీ బలపరుస్తుందని, ప్రజలు యువత నుంచి నాయకులు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కీలక సూచన చేశారు. గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారో జగన్ ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజలు వైసీపీని తిరస్కరించారని అన్నారు.
